అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్- కమలా హారిస్( Donald Trump )ల మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.నిధుల సమీకరణ, ఓపీనియన్ పోల్స్‌లో కమలా హారిస్ దూసుకెళ్తుండటంతో ట్రంప్ బృందం ఆమెను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది.
తాజాగా ట్రంప్ రన్నింగ్ మెట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి ) జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను తీవ్రంగా ప్రచారం చేస్తున్న ఆయన పెన్సిల్వేనియా( Pennsylvania )లోని రీడింగ్‌లో ఓ సూపర్ మార్కెట్‌లో కనిపించాడు.దేశంలోని ద్రవ్యోల్భణం గురించి ఓ వీడియోలో వివరిస్తూ గుడ్ల కేటగిరీలోకి వచ్చాడు.ఇక్కడ ధరలను చూస్తే కమలా హారిస్( Kamala Harris) విధానాల కారణంగా వస్తువులు ఖరీదైనవిగా మారాయని వాన్స్ ఎద్దేవా చేశారు.
నా పిల్లలు ప్రతిరోజూ ఉదయం 14 కోడిగుడ్లను తింటారని తెలిపాడు.కమలా హారిస్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు డజను గుడ్లు 1.50 డాలర్ల లోపే ఉండేవని, ఇప్పుడవి 4 డాలర్లకు చేరిందని వాన్స్ వ్యాఖ్యానించారు.అలాగే గ్రౌండ్ బీఫ్ పౌండ్ ధర 4 డాలర్ల నుంచి 6 డాలర్లకు చేరుకుందన్నారు.1400 రోజుల క్రితం నుంచి నేటి వరకు అమెరికా ప్రజల కోసం నువ్వేం చేశావని కమలా హారిస్‌ను వాన్స్ ప్రశ్నించారు.
అయితే వాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.ఆయన అబద్ధం చెప్పారంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు.వాన్స్ విడుదల చేసిన వీడియోలో కోడిగుడ్డు ధర 2.99 డాలర్లుగా ఉంటే.వాన్స్ మాత్రం 4 డాలర్లకు అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.
కథలను రాయడం కాదు.అబద్ధం కూడా సరిగా చెప్పలేడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే Sofi lern ప్రకారం.కన్స్యూమర్ ప్రెస్ ఇండెక్స్‌ను ఉటంకిస్తూ పెన్సిల్వేనియాలో గుడ్ల ధర సగటున 4.52 డాలర్లని తెలిపింది.దీనిని బట్టి వాన్స్ మాటలు సాంకేతికంగా సరైనవేనని పేర్కొంది.
మార్నింగ్ కాల్ ప్రకారం.ఆగస్ట్ 2024 నాటికి అమెరికా ద్రవ్యోల్బణం రేటు 2.5 శాతంగా ఉంది.ఇది ఫిబ్రవరితో పోలిస్తే కనిష్ట స్థాయి.