ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం 80 కోట్ల ఖర్చు..దానయ్య చేతులెత్తయ్యడం తో చివరికి ..?

ఆర్ఆర్ఆర్ సినిమా కి ఆస్కార్ వేదికగా అవార్డు దక్కుతుందా లేదా అనే సంగతి పక్కన పెడితే రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే రాజమౌలి అండ్ కో ఈ సినిమా కి అవార్డు ఎలాగైనా తేవాలి అని కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారు.

 Promotion Amount For Rrr , Rrr Movie , Rrr,oscar Award ,rajamouli And Co,produc-TeluguStop.com

మరి ఈ సినిమా అస్సలు నిర్మాత దానయ్య .ఈయన సినిమాను నిర్మించిన మాటే కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం కొల్లగొట్టిన ఏ అవార్డు ఫంక్షన్ లోను దానయ్య కనిపించడం లేదు.పైగా తన సినిమా ప్రపంచ వేదికల పైన ప్రశంసలు అందుకుంటుంటే అయన మాత్రం ఎక్కడ ఉన్నారో కూడా కనిపించడం లేదు.

Telugu Danayya, Oscar Award, Amount Rrr, Rajamouli, Rrr, Tamma Bharadwaj-Telugu

సోషల్ మీడియా లోను దానయ్య హడావిడి లేకపోవడం తో సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక దానయ్య ఈ సినిమాను ఇంటర్నేషనల్ వేదికల పైన ప్రమోట్ చేయడం కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఒప్పుకోలేదు అని వినిపిస్తుంది.అందుకే రాజమౌళి స్వయంగా రంగం లోకి దిగి ఈ సినిమా ప్రమోషన్ ఖర్చులన్నీ కూడా భరిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక విదేశాల్లో కాంటాక్ట్స్ విషయంలో బాహుబలి నిర్మాత ఆర్కా మీడియా అధినేత శోభు యార్లగడ్డ ఉండనే ఉన్నాడు.అందుకే దానయ్య ను పక్కన పెట్టి మరి దర్శకుడు మరియు హీరోలు ఇంత సాహసం చేసి సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు.

Telugu Danayya, Oscar Award, Amount Rrr, Rajamouli, Rrr, Tamma Bharadwaj-Telugu

మరోవైపు తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వ్యక్తి ఈ చిత్రం ప్రమోషన్ కోసం పెట్టిన డబ్బుల విషయంలో విమర్శలు చేస్తున్నారు.అంత డబ్బు చేతిలో ఉంటె మంచి సినిమాలు, చిన్న సినిమాలు అనేకం తీయచ్చు అనేది అయన వాదన.అందులో నిజం లేకపోలేదు.2 లేదా 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి అద్భుతాలు సృష్టించిన సినిమాలు అనేకం ఉన్నాయ్.ఇక ఈ విషయం లో ఒక వర్గం వారు మాత్రం మరోలా స్పందిస్తున్నారు.ఒక రీజియన్ సినిమాను ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా ప్రమోషన్స్ చేసుకోవడం వల్ల మన తెలుగు వారి ఖ్యాతి పెరుగుతుంది తప్ప పోయేది ఏముంది అని అంటున్నారు.

ఇందులో అందరి వాదన నిజమే అయినా పెట్టుకునే వారికి లేని బాధ చూసేవారికి ఎందుకు అనేది మాత్రం నిజం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube