మెషిన్ గన్స్‌తో స్క్రీన్‌పై మంటలు.. ఈ యాక్షన్ సినిమాలు చూస్తే గూస్‌బంప్స్..!!

సాధారణంగా మన ఇండియన్ యాక్షన్ సినిమాల్లో చిన్న గన్స్ మాత్రమే వాడతారు.కానీ కొన్ని సినిమాల్లో మాత్రం భారీ సైజులో ఉన్న మెషిన్ గన్స్ కూడా వాడి యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

 Action Movies Which Works With Machine Guns Robo Animal Agent Khaidi Details, Ac-TeluguStop.com

ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలో యష్ వాడిన గన్స్ చూస్తే మతిపోతుంది.విక్రమ్ ఖైదీ అనిమల్ సినిమాల్లో వరుసగా కమల్‌ హాసన్, కార్తీ, రణ్‌బీర్ కపూర్ భారీ మెషిన్ గన్స్ వాడి మంటలు పుట్టించారు.

అయితే గన్స్‌ను వీరికంటే వేరే రేంజ్ లో వాడిన మరికొంతమంది ఇండియన్ సినిమా హీరోలు ఉన్నారు.వారెవరో, ఆ సినిమాలేవో తెలుసుకుందాం పదండి.

• రోబో

రజనీకాంత్ హీరోగా ఎస్.శంకర్ డైరెక్ట్ చేసిన రోబో సినిమాలో( Robo ) యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు.ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో చిట్టి ది రోబోట్ “హ్యాపీ దీవాలి ఫోక్స్” అంటూ వందల మెషిన్ గన్లను ఒక దగ్గరగా చేర్చి బుల్లెట్స్ పేల్చుతుంది.ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి.

గ్రాఫిక్స్ ఖర్చులు తగ్గించుకోవడానికి రోబో ఐ యానిమేషన్స్‌ను కూడా చూపించలేదు.అందుకే ఈ సినిమాలో ఎక్కువ సీన్లలో రోబో కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంది.

Telugu Animal, Heroesmachine, Khaidi, Mark Antony, Machine Guns, Robo, Thegimpu,

• ఖైదీ

లోకేశ్ కనగరాజ్ తీసిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఖైదీ (2019)( Khaidi ) బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇందులోని యాక్షన్స్ సీన్ల కారణంగానే ఆ మూవీ ఆ రేంజ్ లో సక్సెస్ అయ్యింది.ఈ మూవీలో హీరో కార్తీ M134 అనే ఓ సిక్స్-బ్యారెల్ రోటరీ మెషిన్ గన్ ఉపయోగించాడు.ఇది చాలా వేగంగా బుల్లెట్ ను ఫైర్ చేస్తుంది.దీనిని U.S.మిలిటరీలోని అనేక శాఖలు ఉపయోగిస్తాయి.అయితే సినిమాలో ఈ గన్ను ఉపయోగిస్తున్నప్పుడు అది దోమల మెషిన్ ఏమో అని రౌడీలు అనుకుంటారు.

కానీ అసలు సంగతి తెలుసుకునే లోపే చచ్చిపోతారు.

Telugu Animal, Heroesmachine, Khaidi, Mark Antony, Machine Guns, Robo, Thegimpu,

• వినయ విధేయ రామ

ఈ యాక్షన్ మూవీలో హీరో రామ్ చరణ్ చేత సింగిల్ హ్యాండ్ తో మెషిన్ గన్ యూజ్‌ చేయించాడు బోయపాటి శ్రీను.ఆ యాక్షన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పించాయి.ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ.

Telugu Animal, Heroesmachine, Khaidi, Mark Antony, Machine Guns, Robo, Thegimpu,

• విక్రమ్, కేజీఎఫ్

కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో( Vikram Movie ) వివిధ రకాల మెషిన్ గన్స్‌తో యాక్షన్ సీన్లు షూట్ చేశారు.అందులో లెజెండ్స్ కౌబాయ్ లివర్ యాక్షన్ CO2 BB ఎయిర్ రైఫిల్, హెల్బాయ్ M4 ఎయిర్ రైఫిల్ వంటి డెడ్లీ వెపన్స్ కూడా ఉన్నాయి.ఇక కేజీఎఫ్ సినిమాలో( KGF ) హీరో రాఖీ బాయ్ పెద్దమ్మ అని ముద్దుగా పిలుచుకునే భారీ మెషిన్ గన్ వాడారు.దీని ద్వారా వచ్చిన బుల్లెట్ల వేడికి దాని ముందు భాగం నిప్పు కణిక వలె తయారవుతుంది.

దానితో హీరో సిగరెట్ అంటించుకునే సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ అయింది.

Telugu Animal, Heroesmachine, Khaidi, Mark Antony, Machine Guns, Robo, Thegimpu,

• ఏజెంట్, తెగింపు

ఏజెంటు( Agent ) సినిమాలో అఖిల్ తన నడుం పై పెట్టుకొని భారీ మెషిన్ గన్ కాలుస్తాడు.ఇక తెగింపు సినిమాలో క్లైమాక్స్‌లో మెషిన్ గన్లు ఒక మోత మోగిస్తాయి.

Telugu Animal, Heroesmachine, Khaidi, Mark Antony, Machine Guns, Robo, Thegimpu,

• మార్క్ ఆంటోనీ, యానిమల్

మార్క్ ఆంటోనీ మూవీలో అనకొండ అనే ఒక పెద్ద గన్ తీసుకొస్తారు.అదైతే ఒక ఊరంత పెద్దగా ఉంటుంది.యానిమల్ సినిమాలో( Animal Movie ) కూడా పెద్ద పెద్ద డెడ్లీ గన్స్ కనిపిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube