మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) నటించిన గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రాజమహేంద్రవరంలో( Rajamahendravaram ) ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు భారీ ఏర్పాలను కూడా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.
అయితే ఈ వేడుకకు సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఇలా ఒక సినిమా వేడుకకు రావడంతో పవన్ కళ్యాణ్ స్పీచ్ పైనే అందరి ఆసక్తి నెలకొంది.ఈయన సినిమాల గురించి ఎలా మాట్లాడుతారు ఏంటి అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి( Cinema Industry ) రాజకీయ రంగు పూయద్దు అంటూ అందరికీ సూచనలు చేశారు.
సినిమా టికెట్లను( Movie Tickets ) పెంచకపోతే బ్లాక్ లో సినిమా టికెట్లను కొనుగోలు చేస్తారు.అదే సినిమా టికెట్ల రేట్లు పెంచితే జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సినిమా టికెట్లు పెంచుతున్నాము.
మాకు హీరోలతో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచామని ఎవరు కూడా చిత్ర పరిశ్రమను రాజకీయాలలోకి లాగొద్దని కూటమి ప్రభుత్వానికి ఇలాంటివి ఇష్టం లేదు అంటూ పవన్ కళ్యాణ్ తెలియచేశారు.గత ప్రభుత్వం నా సినిమాకు టికెట్ల రేట్లు పెంచకపోవడం కాకుండా భారీగా తగ్గించింది.కానీ మా ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను ఎక్కడా చూపదని పవన్ తెలిపారు.సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టండి.సినీ పరిశ్రమలో ఉన్న నిపుణులతో యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచండి అంటూ పవన్ ఈ సందర్భంగా తెలిపారు.