ప్రస్తుతం దేశం అంతట కూడా చలి తీవ్ర స్థాయిలో ఉంది.దీంతో అందరూ కూడా స్నానం చేయడానికి గ్రీజర్స్, హీటర్స్ ను తెగ వాడేస్తున్నారు.
కానీ, అందరికి గీజర్స్ ,హీటర్స్ ను కొనుక్కునే అవకాశం ఉండదు.అలాంటి వారి కోసం ఒక మహిళ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఆమె తెలివి ముందు గీజర్లు, హీటర్లు కూడా పనికిరావు.కరెంటు( Current ) సహాయం లేకుండా చాలా సులువుగా మహిళ నీటిని సులువుగా వేడి చేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.
ఆమె కేవలం ఒక పాత్ర ద్వారా కరెంట్ సహాయం లేకుండా నీటిని చాలా సులువుగా వేడి చేస్తుంది.ముందుగా పాత్రలో కొన్ని కర్ర ముక్కలు వేసి వాటిని వెలిగించింది.అనంతరం ఆ పాత్రకు ఒక స్టీల్ పైపును( Steel Pipe ) బిగించి.ఆ మంట కారణంగా ఆ పాత్రలతో పాటు ఆ పైపు కూడా వేడెక్కగా.
ఆ సమయంలో పైపులో ఒకవైపు నుంచి చల్లని నీటిని వేస్తూ ఉంటే మరోవైపు నుంచి వేడి నీరు( Hot Water ) బయటికి వచ్చేస్తుంది.
ఇలా వేడి నీళ్లు బయటకి రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక ఈ వీడియోను చూసిన కొంత మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు.కొంతమంది ఈ చలికాలం ఇది బాగా ఉపయోగపడుతుందని కామెంట్ చేస్తూ ఉంటే.
మరికొందరు ఆ మహిళ తెలివి గురించి కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెదుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.