కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.హీరోగా కమెడియన్ గా విలన్ గా ఇలా చెప్పుకుంటూ పోతే వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఇప్పటి వరకు చేయని పాత్ర లేదుఅని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక అప్పట్లో మోహన్ బాబు సినిమాలు టాలీవుడ్ లో ఎంతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉండేవి.ఇక ఏదైనా సినిమా హిట్ అయిందంటే చాలు దాదాపు 200 రోజుల పాటు థియేటర్లో అదే రీతిలో కలెక్షన్స్ రాబడుతు ఉండేది.
ఇక ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతూ ఉండేవి.అందుకే మోహన్ బాబు ను కలెక్షన్ కింగ్ అంటూ అంటూ ఉంటారు టాలీవుడ్ ప్రేక్షకులు.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గా నిలిచే పెదరాయుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన.
ఇక ఇప్పటికి కూడా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.అయితే మోహన్ బాబు శ్రీకాంత్ హీరోగా.మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అప్పుచేసి పప్పుకూడు.ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిర్మాతగా ఉన్న మోహన్బాబుకు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా.
ఇక ఈ సినిమాలో మోహన్ బాబు సరసన గ్రేసిసింగ్ నటించింది.ఇక అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ విజయాన్ని సాధించింది.
అయితే ఈ సినిమా సమయంలో ఏకంగా మోహన్బాబుకు ఒకప్పటిస్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్10 లక్షల రూపాయలు కట్టారట.
అదేంటి ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుకు 10 లక్షలు జరిమానా ఎందుకు కట్టారు?.ఆ స్టోరి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అప్పటికే నిర్మాతగా నష్టాల్లో ఉన్న తప్పుచేసి పప్పుకూడు అనే సినిమాకు మరో సారి నిర్మాతగా చేసేందుకు రిస్క్ తీసుకున్నారు మోహన్ బాబు.
ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాలో అప్పటి క్రేజ్ ప్రకారం ఆర్తి అగర్వాల్ అయితే బాగుంటుందని అనుకున్నారు.ఆర్తి అగర్వాల్ అప్పటికే ఎంతో బిజీ బిజీగా ఉంది.
అయినప్పటికీ మోహన్బాబు సినిమా చేసేందుకు ఒప్పుకుంది.ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రారంభం సమయం వచ్చేసింది.
కానీ అదే సమయంలో తనకు పరీక్షలు ఉన్నాయి అంటూ కారణం చెప్పి సినిమా నుంచి తప్పుకుంది.కానీ పరీక్షలు ఉన్నాయి అని చెప్పిన ఆ తేదీలలోనే వేరొక సినిమా షూటింగ్లో పాల్గొనడం మోహన్బాబుకు తెలిసింది .దీంతో ఇక ఫిలింఛాంబర్లో ఈ విషయంపై ఫిర్యాదు చేయగా ఏకంగా పది లక్షల వరకు మోహన్ బాబు కి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందట ఆర్తి అగర్వాల్.