ఈ అలవాట్ల వల్లే కిడ్నీలు పాడవుతాయి

ప్రతి ఏటా లక్షలమంది కిడ్ని సమస్యలతో ఆస్పత్రి మంచం ఎక్కుతున్నారు.రాళ్లు చేరడం నుంచి కిడ్ని పూర్తిగా పాడయ్యేవరకు .

అన్ని సమస్యలకి మనుషుల అలవాట్లే కారణం.కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Habits That Damage Our Kidneys-Habits That Damage Our Kidneys-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

* మూత్రాన్ని ఆపడం :

చాలామంది మూత్రాన్ని ఆపుతూ ఉంటారు.పరిస్థితులు అనుకూలించకపోతే, గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే ఆపేవారు కూడా ఉన్నారు.

ఇలా చేయడం వల్ల కిడ్నిలో రాళ్ళు చేరే పరిస్థితితో పాటు కిడ్నీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం రావొచ్చు.

* తీపి ఎక్కువగా తినటం :

తీపివస్తువులు రుచికరంగా ఉంటాయి కాని, ఆరోగ్యానికి ఎన్నోరకలా ముప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి.ఫ్రుక్టోస్ అతిగా శరీరంలోకి చేరితే అది కిడ్నీలకు చాలా ప్రమాదం కావచ్చు.కావట్టి తీపి వస్తువులు ఎప్పుడోకాని తినకూడదు.

* అదుపు తప్పిన బ్లడ్ ప్రెషర్ :

ఎప్పుడో ఏదో ఒక సమస్య వస్తే తప్ప, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం అలవాటు ఉండదు మనకు.ఇది చాలా తప్పు.

రెగ్యులర్ గా బ్లడ్ ప్రెషర్ చేక్ చేసుకోని, రక్తప్రసరణను అదుపులో ఉంచుకోవాలి.

* పద్ధతిగా లేని మందుల వాడకం :

ప్రతీ చిన్న విషయానికి మందుమాత్రలు వాడటం కరెక్టు విషయం కాదు.అలాగే డాక్టరు చెప్పిన పద్ధతిలోనే మందులు వాడాలి.సమయం తప్పడం, లెక్కతప్పడం మీ కిడ్నీకి మంచిది కాదు.

* సిగరేట్లు, మద్యపానం :

కిడ్నీలకు అతిపెద్ద శతృవులు ఈ అలవాట్లు.మధుమేహం లాంటి జబ్బు ఉండి, ఈ అలవాట్లు కూడా ఉంటే అది ఇంకా ప్రమాదం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు