మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

అభిమాని రేణుకా స్వామి( Renuka Swamy ) హత్య కేసు సినిమా ఇండస్ట్రీలో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే.అయితే ఈ కేసులో భాగంగా దర్శన్‌( Darshan ) అతడి ప్రియురాలు పవిత్ర గౌడ( Pavithra Gowda ) కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.

 Pavithra Gowda Daughter Kushi My Mother Has Never Hurt Anyone Details, Pavithra-TeluguStop.com

కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌ పై బయటకు వచ్చారు.అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది.

ఇంకా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో విమర్శలు గుర్తించారు.ఈ ట్రోలింగ్స్ ఫై నెగటివ్ కామెంట్స్ పై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ( Kushi Gowda ) స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ పెట్టింది.ఇలాంటి పోస్ట్‌ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు.కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి.దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.

అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు.అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు.మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది.తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది.మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్‌స్పిరేషన్‌.తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది.

Telugu Darshanpavithra, Darshan, Kushi Gowda, Pavithra Gowda, Pavithragowda, Ren

ఆవిడే నా సర్వస్వం.మా అమ్మ.ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం.తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం.నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు.తను అంత బాధ అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు.

నేను టీనేజర్‌ ను.మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు.ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.

Telugu Darshanpavithra, Darshan, Kushi Gowda, Pavithra Gowda, Pavithragowda, Ren

మా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు.ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు.పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి.

అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.బాధగా ఉంది.తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది.మా అమ్మ ఉత్తమురాలు.

ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను.దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి.

మా అమ్మ నాకు హీరో.దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది ఈ పోస్ట్ పై నెటిజెన్స్ స్పందిస్తూ కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube