టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు భారీగా అదనపు రేట్లు.. ఆ రేట్లతో మూవీ చూస్తారా?

సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) కానుకగా ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్,( Game Changer ) డాకు మహారాజ్,( Daaku Maharaaj ) సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

 Huge Ticket Rates For Tollywood Sankranti Movies Details, Sankranthiki Vasthunna-TeluguStop.com

ఈ మూడు సినిమాలకు ఏపీలో అదనపు రేట్లకు అనుమతులు లభించాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో టికెట్ 600 రూపాయలు కాగా డాకు మహారాజ్ బెనిఫిట్ షో టికెట్ 500 రూపాయలు అని సమాచారం.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సైతం టికెట్ రేట్ల పెంపు ఉందని సమాచారం.అయితే ఇంత భారీ టికెట్ రేట్లతో( Ticket Rates ) సినిమాలను చూస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫుట్ ఫాల్స్ ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయని తెలుస్తోంది.

Telugu Daaku Maharaaj, Game Changer, Ram Charan, Sankranthi, Ticket Rates, Venka

పెద్ద సినిమాల కోసం భారీగా ఖర్చు చేసిన సినీ అభిమానులు తర్వాత రోజుల్లో చిన్న సినిమాలను, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Daaku Maharaaj, Game Changer, Ram Charan, Sankranthi, Ticket Rates, Venka

సినిమాలకు హిట్ టాక్ వస్తే భారీ టికెట్ రేట్లు సమస్య కాదు కానీ టాక్ అటూఇటుగా ఉంటే మాత్రం ఈ రేట్ల వల్ల ఇబ్బందేనని చెప్పవచ్చు.గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.ఇతర భాషల్లో ఈ సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో తెలియాల్సి ఉంది.సంక్రాంతి మూడు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube