స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్టార్ డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్(Daku maharaj) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరో రెండు రోజుల్లో సంక్రాంతికి (Sankranti) విడుదల కానున్న అన్ని సినిమాల బుకింగ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది.డాకు మహారాజ్ సినిమాకు బాలయ్య గత సినిమాలకు మించి బిజినెస్ జరిగింది.
ఏపీలో టికెట్ రేట్ల పెంపు లభించడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.ఈ సినిమాకు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
కనీసం 84 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.డాకు మహారాజ్ కలెక్షన్ల విషయంలో సైతం సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంది.
జనవరి నెల 12వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది.నైజాం ఏరియాలో మాత్రం ఈ సినిమాకు కొంతమేర థియేటర్ల విషయంలో సమస్య ఎదురవుతోంది.గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ (Game Changer, Daaku Maharaaj)సినిమాల టాక్ ఆధారంగా థియేటర కేటాయింపులో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు.
బాలయ్య ఈ సినిమాకు 34 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకుంటున్నారు.బాలయ్య ఇతర భాషల్లో సైతం డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.డాకు మహారాజ్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.డాకు మహారాజ్ టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.డాకు మహారాజ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.