తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి నటులు చాలామంది ఉన్నారు.అయినప్పటికి సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటున్న వెంకటేష్( Venkatesh ) లాంటి నటుడు మాత్రం ఇప్పటికి మంచి ఫ్యామిలీ సబ్జెక్టు సినిమాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు.
అయితే గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.కారణం ఏదైనా కూడా సినిమాల ఎంపికలో వెంకటేష్ గత కొన్ని సంవత్సరాలు నుంచి పెద్దగా జాగ్రత్తలు అయితే తీసుకోవడం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
కానీ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీగా ఉంటున్నాడు.
అందుకే ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam ) అనే సినిమాతో మరోసారి సంక్రాంతి హీరోగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ట్రైలర్ నైతే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.
మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఎప్పుడు రాబోతుంది అనే దాని మీదనే సర్వత్ర ఆసకైతే నెలకొంది.
ఇక సంక్రాంతి సినిమా ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అంటూ దిల్ రాజు ఇప్పటికే చాలా మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేసేలా కొన్ని మాటలైతే మాట్లాడాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సంక్రాంతి కానుకగా వస్తుంది.కాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా? లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.