ఆ విషయం తెలిసుంటే బేబీ జాన్ లో నటించేదాన్ని కాదు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి మనందరికీ తెలిసిందే.కీర్తి సురేష్ పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 Keerthi Suresh Comments Baby John Movie Details, Keerthi Suresh, Tollywood, Boll-TeluguStop.com

పెళ్లికి ముందు నుంచి కీర్తి సురేష్ పేరు తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది.పెళ్లి విషయంలో ఆ తర్వాత తాను నటించిన బేబీ జాన్ సినిమా( Baby John Movie ) ప్రమోషన్స్ విషయంలో ఇలా ఏదో ఒక విషయంతో వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది.

గత ఏడాది 2023, డిసెంబర్ 11వ తేదీన తన స్నేహితుడు ఆంటోనీని( Antony ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత కొత్త చిత్రం ఏదీ కమిట్‌ కాలేదు.

దీంతో ఈమె నటనకు విరామం పలికినట్లు ప్రచారం అందుకుంది.

Telugu Baby John, Bollywood, Hindi Language, Keerthi Suresh, Keerthysuresh, Keer

కాగా కీర్తి సురేష్‌ చివరిగా నటించిన చిత్రం బేబీ జాన్‌. ఈమె నటించిన తొలి హిందీ చిత్రం ఇదే.అయితే ఈ చిత్రంలో నటించి ఉండేదాన్ని కాదని కీర్తి సురేష్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొనడం విశేషం.దీని గురించి ఆమె తెలుపుతూ ఇంతకుముందు తమిళంలో తను నటించిన రఘు తాత చిత్రాన్ని( Raghu Thatha Movie ) తెరపైకి తీసుకొచ్చింది.అందులో హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకునే తీరాలంటూ ఒత్తిడి చేయడాన్ని తప్పు అనే ఇతివృత్తంతో రూపొందించినట్లు చెప్పారు.

ఆ చిత్ర ట్రైలర్‌ లో హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్‌ చోటు చేసుకుందని అన్నారు.

Telugu Baby John, Bollywood, Hindi Language, Keerthi Suresh, Keerthysuresh, Keer

తమిళ ప్రేక్షకులు పలువురు రఘు తాత చిత్రంలో కీర్తి నటించినందుకు ఎంతగానో ప్రశంసించారని అన్నారు.కాగా ఆ వెంటనే తాను బేబీ జాన్‌ అనే హిందీ చిత్రంలో నటించడం జరిగిందని,దీంతో హిందీ భాషకు వ్యతిరేక రూపొందిన కథ చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బాలీవుడ్‌ లో ఎంట్రీ అయ్యావు అంటూ పలువురు హిందీ ప్రేక్షకులు విమర్శించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.తాను హిందీ భాషకు వ్యతిరేక కథా చిత్రంలో నటించ లేదని, హిందీ భాషను కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ తీసిన చిత్రంలోనే నటించానని చాలా భేటీల్లో చెప్పానని అన్నారు కీర్తి సురేష్.

అసలు ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగా ఊహించి ఉంటే బేబీ జాన్‌ చిత్రంలో నటించేదాన్నే కాదని నటి కీర్తి సురేష్‌ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube