ఇటీవల రోజుల్లో ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ఎంతో మంది అధిక బరువు సమస్య( Obesity )తో బాధపడుతున్నారు.అధిక బరువు కారణంగా శరీర ఆకృతి దెబ్బ తినడమే కాదు.
ఎన్నో అనారోగ్య సమస్యలు సైతం తలెత్తుతుంటాయి.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ఖచ్చితంగా మీ డైట్ లో ఉండాల్సిందే.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక క్యారెట్( Carrot ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని పీల్ తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆరెంజ్ పల్ప్( Orange Pulp ), ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు మరియు వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన క్యారెక్టర్ ఆరెంజ్ కోకోనట్ జ్యూస్ సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్( Carrot Orange Coconut Juice ) టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ముఖ్యంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఉత్తమంగా సహాయపడుతుంది.రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్ ను తీసుకుంటే మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.
దాంతో క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి కూడా ఈ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.శరీరం అంతర్గతంగా శుభ్రం అవుతుంది.కిడ్నీలో రాళ్లు ఉంటే కరుగుతాయి.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటారు.రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.
హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది.కంటి చూపు( Eye Sight ) రెట్టింపు అవుతుంది.
మరియు చర్మం సైతం సూపర్ గ్లోయింగ్ గా షైనీగా మెరుస్తుంది.