Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ పవన్ కలవబోతున్నాడా.. పవన్ నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల వారాహి యాత్రను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పలు జిల్లాలను గ్రామాలను సందర్శిస్తున్నారు.

 Will Pspk Meet All The Star Heroes-TeluguStop.com

ఇక ఎక్కడికి వెళ్లినా కూడా భారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ తన మాటలతో యువతతో పాటు అందరిని ఆకట్టుకుంటున్నారు పవన్.ఇక ఇందులో భాగంగానే సినిమాల గురించి హీరోల గురించి కూడా ఆ ప్రస్తావిస్తున్నారు.

మొన్నటికి మొన్న తోటి హీరోలను తనకన్నా గొప్పవాళ్లు అంటూ పొగిడేస్తున్నారు.

Telugu Allu Arjun, Jr Ntr, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood-Movie

నెగ్గాలి అంటే తగ్గాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పవన్ హీరోలందరి అభిమానుల్ని ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.పాత వివాదాల్ని తవ్వి తీసి మరీ తన అభిమానుల తరుపును తాను స్వయంగా క్షమాపణలు అడుగుతున్నారు.కాగా పవన్ రాజకీయ పార్టీ పెట్టి దశాబ్ధం అయింది.

ఇంత కాలం అయిందా కూడా పవన్ నోట రాని కొత్త వ్యాఖ్యలు ఎన్నో వస్తున్నాయి.ఇదంతా పవన్ వ్యక్తిగత ఎజెండా కి సంబంధించింది.

దీనికి సినిమా అనే అంశాన్ని ముడిపెట్టడం సేహేతుకం కాదు.కాగా పవన్ టాలీవుడ్ స్టార్ హీరోలందర్నీ కలవబోతున్నాడా? కలిసి తనకి సహకరించాలని కోరబోతున్నాడా.

Telugu Allu Arjun, Jr Ntr, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood-Movie

అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోల్ని మినహా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ), మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ( Allu arjun )లు ఇప్పటికే యూత్ లో భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోలు.అలాగే అక్కినేని నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మాస్ రాజా రవితేజ, విక్టరీ వెంకటేష్ ఇలా కొంత మంది అగ్ర హీరోలు ఉన్నారు.వీళ్లలో కొంతమందిని పవన్ వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉందని వార్తలు జోరుగా వినిపిస్తున్న.

అభిమానుల మధ్య సఖ్యత కుదిర్చే క్రమంలో ఇతర హీరోలతో పవన్ భేటి కూడా అంతే కీలకం అయ్యే అవకాశం ఉంది.ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube