ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు జీవనశైలి మారిపోవడంతో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు.మరి కొంత మంది ప్రజలు చిన్నచిన్న అనారోగ్యాలకు కూడా వారి శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా తయారయింది.
అందుకోసమే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే మందులను ఎక్కువగా ఉపయోగించి లివర్ చెడిపోయేందుకు కారణమవుతున్నారు.అందుకోసమే వీలైనంత వరకు మందులను తక్కువగా ఉపయోగించడమే మంచిది.
అంతే కాకుండా కచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులను ఉపయోగించాలి.లేదంటే కాలేయం దెబ్బ తినడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే దెబ్బ తినడానికి ఇంకా ఏ కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం.నాణ్యతలేని నూనెతో వండిన ఆహారం తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మద్యం సేవించడం కూడా కాలేయం అనారోగ్యానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అందుకోసమే మద్యం సేవించడం మానేయడమే మంచిది.ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్ పై భారం పడుతుందని, కాబట్టి ఆహారాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినడం ఎంతో మంచిది.రాత్రి పూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి.
ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి.

లేదంటే లివర్ లో వ్యర్ధాలు పెరిగే అవకాశం ఉంది.ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం అసలు మర్చిపోకూడదు.ఇలా చేస్తే లివర్ పై ఒత్తిడి పెరుగుతుంది.అతిగా ఆహారం తీసుకున్న లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.లివర్ పైన ఎక్కువగా భారం పడే అవకాశం ఉంది.కాబట్టి ఈ అలవాటులను దూరం చేసుకుని కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మంచిది
.






