టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు కాగా ఈ హీరోకు క్రేజ్ మామూలుగా లేదు.మరికొన్ని రోజుల్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రామ్ చరణ్ పేరు వెనుక అసలు కథ గురించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
మేము హనుమంతుని భక్తులమని( Hanuman Devotees ) నేను ఇంటర్ చదివే సమయంలో రామ్ చరణ్ పుట్టాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆ సమయంలో మా నాన్నగారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారని పవన్ చెప్పుకొచ్చారు.రాముని చరణాల వల్ల ఉండే వాడు హనుమంతుడు అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.
రామ్ చరణ్ ఆ పేరు తగినట్టే ఉంటాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రామ్ చరణ్ నాకు సోదర సమానుడు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు చరణ్ ను బాగా ఏడిపించేవాడినని ఏడు సంవత్సరాల వయస్సులోనే చరణ్ హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడని పవన్ పేర్కొన్నారు.చరణ్ ఏడాదిలో 100 రోజుల పాటు అయ్యప్పస్వామి మాలలోనో, ఆంజనేయ స్వామి మాలలోనో ఉంటాడని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రామ్ చరణ్ ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రామ్ చరణ్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చరణ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
స్టార్ హీరో రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.