ప్రతి సంవత్సరం జపాన్‌లో( Japan ) నూతన సంవత్సర సమయంలో అరుదైన చేపల వేట విశేషంగా జరగుతుంది.ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల మార్కెట్‌లో అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేప ( Bluefin tuna fish )ఆంధ్రరి ద్రుష్టిని ఆకర్షించింది.276 కిలోల బరువు ఉన్న ఈ చేప మార్కెట్‌లో వేలానికి వచ్చి, భారీ ధరకు అమ్ముడైంది.ఒనోడెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ అరుదైన చేప కోసం ఏకంగా రూ.11 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు.
జపనీయుల నమ్మక ప్రకారం, కొత్త సంవత్సరంలో ట్యూనా చేపను పొందడం అదృష్ట సూచికగా భావిస్తారు.ఇది ఆ ఏడాది సంపద, శ్రేయస్సు కలుగుతుందని జపనీయులు విశ్వసిస్తారు.ఈ కారణంగా, ట్యూనా చేపను పొందేందుకు మార్కెట్‌లో రెస్టారెంట్లు పోటీ పడ్డాయి.చివరికి ఒనోడెరా సంస్థ అత్యధిక ధర చెల్లించి ఈ చేపను గెలుచుకుంది.వారు తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవాన్ని అందించడమే కాకుండా, అదృష్టాన్ని కూడా పంచుతామని ప్రకటించారు.
ఈ అరుదైన చేప పెద్ద ధరకు అమ్ముడవడం సాధారణమైన విషయం కాదు.1999 నుండి చేపల మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన చేపల రికార్డులను పరిశీలిస్తే, 2019లో 278 కిలోల బరువుగల ట్యూనా చేప రూ.18 కోట్లు పలికింది.ఈ రికార్డు ఇప్పటికీ బ్రేక్ కాకపోయినా, 2025లో రూ.11 కోట్లకు అమ్ముడైన ఈ ట్యూనా చేప రెండో స్థానంలో నిలిచింది.ఈ అరుదైన చేప ఖరీదుతో పాటు, జపనీయుల నమ్మకాలు వారి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.ఈ సందర్బంగా ఒనోడెరా సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.“ఈ చేప మా రెస్టారెంట్ కస్టమర్లకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.2025ను అందరికీ శుభవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం కావడంలో గర్విస్తున్నాం” అని అన్నారు.ఈ చేప కొనుగోలు వెనుక ఉన్న ప్రాముఖ్యత ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.