బడ్జెట్‌పై ఎన్ఆర్ఐల ఆశలు .. పన్ను చెల్లింపులపై భారత ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు

త్వరలో కేంద్ర బడ్జెట్ 2025ను నరేంద్రమోడీ( Narendra Modi ) ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

 Union Budget 2025 Nris Proposes Easier Tax Payments And E-verification , Narendr-TeluguStop.com

ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై సామాన్యుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.వారే కాదు.

ఎన్ఆర్ఐలు( NRIs ) కూడా కేంద్ర బడ్జెట్‌ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ప్రధానంగా పన్ను మినహాయింపులు, సంస్కరణల గురించి వారు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.

విదేశాల్లో నివసించే పన్ను చెల్లింపుదారుల కోసం వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరిచే నిమిత్తం డెలాయిట్‌ సంస్థకు చెందిన దివ్య బవేజా ( Divya Baweja )కొన్ని సిఫార్సులను చేసింది.

ప్రస్తుతం భారతదేశంలో పన్ను చెల్లింపులను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, NEFT/RTGS, యూపీఐ ద్వారా చేయవచ్చు.

అయితే వీటిని భారతీయ బ్యాంక్ ఖాతాలకు మాత్రమే పరిమితం చేసింది కేంద్రం.అయితే ఇది ఎన్ఆర్ఐలకి అడ్డంకిగా మారిందని పలువురు నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే వారికి భారతీయ బ్యాంక్ ఖాతా ఉండకపోవచ్చు లేదా విదేశాల నుంచి నిధులను బదిలీ చేయడం పరిమితులు ఉండొచ్చని దివ్య తెలిపారు.ఈ క్రమంలో తమ విదేశీ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా భారత్‌లో పన్ను చెల్లింపులు చేయడానికి అనుమతించాలని దివ్య బవేజా ప్రతిపాదిస్తున్నారు.

Telugu Debit Cards, Divya Baweja, System, Narendra Modi, Neftrtgs, Net, Nris, Bu

ఇది ఎన్ఆర్ఐలకు చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుందని , వారు నివసించే ప్రదేశంతో సంబంధం లేకుండా వారికి పన్ను సమ్మతిని మరింత అందుబాటులోకి తీసుకొస్తుందని దివ్య పేర్కొన్నారు.కాగా.భారతదేశంలో ఈ- ఫైలింగ్ వ్యవస్ధ ( E-filing system )పన్ను రిటర్న్‌ దాఖలు ప్రక్రియను మెరుగుపరిచింది.అయితే ఈ- ఫైలింగ్ చివరి దశ, ఈ- వెరిఫికేషన్, ఎన్ఆర్ఐలకు సవాలుగా మారింది.

ప్రస్తుతం ఈ- వెరిఫికేషన్ కోసం ఇండియాలో మొబైల్ నెంబర్‌కు ఆధార్ ఓటీపీ లేదా డిజిటల్ సంతకం అవసరం.

Telugu Debit Cards, Divya Baweja, System, Narendra Modi, Neftrtgs, Net, Nris, Bu

ఈ- ధృవీకరణ ప్రక్రియను ఓటీపీ ద్వారా విదేశీ మొబైల్ నెంబర్స్‌కు కూడా విస్తరించాలని , ఎన్ఆర్ఐల కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ప్రారంభించాలని బవేజా సూచిస్తున్నారు.ఎన్ఆర్ఐలు చివరి దశను పూర్తి చేయడానికి మరింత సమయాన్ని (30 రోజులు) ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube