మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) త్వరలోనే గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రోమోలను విడుదల చేస్తున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా తన కుమార్తె క్లీన్ కారా( Klin Kaara ) ప్రస్తావన తీసుకొస్తున్న విషయం తెలిసిందే.ఉపాసన రాంచరణ్ పెళ్లి జరిగిన సుమారు 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇక ఈ చిన్నారికి ప్రస్తుతం రెండు సంవత్సరాల వయసు ఉంది అయినప్పటికీ ఒక్కసారి కూడా తన కుమార్తె ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం అభిమానులకు చూపించలేదు ఇక మెగా అభిమానులు సైతం ఎప్పుడెప్పుడు మెగా ప్రిన్సెస్ ని చూస్తామా అనే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా తన కుమార్తె గురించి రామ్ చరణ్ ని ప్రశ్నించారు.
తమ కూతురిని ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తారు అంటూ బాలకృష్ణ అడగడంతో రామ్ చరణ్ సమాధానం చెబుతూ.తన కూతురు నన్ను ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో ఆ క్షణమే నేను నా అభిమానుల కోసం తన కుమార్తెను పరిచయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా తన కూతురి గురించి చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక తాను ఇంట్లో కనుక ఉంటే తన కుమార్తె బాధ్యతలు అన్నిటిని కూడా తానే తీసుకుంటానని కూడా వెల్లడించారు.ముఖ్యంగా తనకు ఫుడ్ పెట్టే విషయంలో నన్ను మించిన వారు ఎవరూ లేరని తన వద్ద చాలా మంచిగా ఫుడ్ తింటుంది అంటూ తన కుమార్తె గురించి చరణ్ తెలిపారు.