కొవిడ్ మహమ్మారి తుఫాను తర్వాత ప్రపంచం ఇప్పుడే కొంత ఉపశమనం పొందుతుందనుకుంటున్న తరుణంలో, మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది.ఇది హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV).
ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.దీని ప్రభావం జపాన్ సహా ఇతర దేశాలపై కూడా పడుతుండటం గమనార్హం.
ఈ నేసథ్యంలో భారత్‌లో తొలి HMPV కేసు నమోదయ్యింది.బెంగళూరులో( Bangalore ) 8 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకినట్లుగా నిర్ధారణ జరిగింది.
బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేసారు.
ఈ వైరస్ సోకినవారిలో ప్రధానంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించే లక్షణాలుగా ఉంటున్నాయి.వైరస్( Virus ) తీవ్రత అధికంగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా( Bronchitis, pneumonia ) వంటి సమస్యలు కూడా ఎదురవచ్చు.సాధారణంగా, ఈ వైరస్ సోకిన 3–6 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి.
వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్ము ద్వారా వచ్చే తుంపర్లు, కలుషితమైన ఆహార పదార్థాలు ద్వారా వ్యాపిస్తుంది.వైరస్ బారినపడిన వ్యక్తితో షేక్‌హ్యాండ్ చేయడం లేదా తాకడం ద్వారా కూడా వ్యాపించవచ్చు.
ఇకపోతే, చైనాలో( China ) ఈ వైరస్ కారణంగా ప్రజలు ఆసుపత్రులకు భారీగా చేరుతున్నారు.ఆరోగ్యశాఖ ఆధికారుల ప్రకారం, ఈ వ్యాధి తీవ్రత కంట్రోల్‌లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.డిసెంబరు 16–22 మధ్య వారంలో వైరస్ కేసులు భారీగా పెరిగాయని సమాచారం.అలాగే జపాన్‌లో ఈ వైరస్ 7 లక్షల 18 వేల కేసులను ప్రభావితం చేసింది.
ఇందులో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారినపడినట్లు గుర్తించారు.ఈ వైరస్‌పై ఇప్పటికీ పలు దేశాలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా, చైనా వైద్య రంగంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.గత కొవిడ్ మహమ్మారి అనుభవాల నేపథ్యంలో ఈసారి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
హెచ్‌ఎంపీవీ వైరస్ తీవ్రత ప్రస్తుతానికి నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.ఆరోగ్య నిపుణుల సూచనలు పాటించి, శుభ్రత, భౌతిక దూరం వంటి ప్రాథమిక చర్యలు అనుసరించడం మేలని వైద్యులు హితవు పలుకుతున్నారు.