రాత్రి 11 అయినా భోజనం లేదు.. భారతీయ విందులపై అమెరికన్ షాకింగ్ కామెంట్స్!

ఢిల్లీలో నివసిస్తున్న అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ క్రిస్టెన్ ఫిషర్ ( American influencer Kristen Fisher )ఇండియన్ డిన్నర్ పార్టీలపై తన షాకింగ్ అనుభవాలను పంచుకున్నారు.అమెరికాలో భోజనం డిన్నర్ పార్టీకి ప్రారంభం అయితే, భారతదేశంలో అది ముగింపు అని ఆమె అన్నారు.

 No Dinner Even At 11 Pm American Shocking Comments On Indian Dinners, Indian Din-TeluguStop.com

ఈ సాంస్కృతిక తేడా ఆమెను ఎంతగానో ఆశ్చర్యపరిచింది.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఫిషర్ మాట్లాడుతూ, అమెరికాలో అతిథులు( Guests in America ) రాగానే భోజనం వడ్డిస్తారు, ఆ తర్వాత కబుర్లు చెప్పుకుంటారు.

కానీ, ఇక్కడ సీన్ రివర్స్.అతిథులు వచ్చాక చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం వడ్డిస్తారు.

కొన్నిసార్లు రాత్రి 11 గంటలు దాటినా భోజనం ఉండదు! .

“భోజనం ఇంత ఆలస్యంగా వడ్డిస్తే చల్లారిపోదా?” అని ఫిషర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అంతేకాదు, అతిథులతో సరదాగా గడపకుండా వంటగదిలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఒకసారి రాత్రి 11 గంటల తర్వాత భోజనం చేయకుండానే తన స్నేహితురాలి ఇంటి నుంచి బయలుదేరితే, “ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నావు?” అని అడిగారని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఈ అనుభవం తనకు చాలా కష్టంగా ఉందని ఫిషర్( Fisher ) అన్నారు.అమెరికాలో సమయానికి రావడం, వెంటనే తినడం సాధారణం, కానీ ఇక్కడ అది భిన్నంగా ఉండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.చాలా మంది నెటిజన్లు ఫిషర్ అనుభవానికి తమ మద్దతు తెలిపారు.మరికొందరు అమెరికాలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు.“అయ్యో పాపం, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు” అని కొందరు సరదాగా కామెంట్లు పెట్టారు.ఫిషర్ తన అనుభవాలను నిజాయితీగా పంచుకోవడం ద్వారా, వివిధ సంస్కృతుల మధ్య అవగాహన ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube