2025 సంవత్సరంలో మనవడు కావాలని కోరిన సురేఖ.. చరణ్ శుభవార్త చెబుతారా?

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.( Game Changer ) కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

 Ram Charan Balakrishna Unstoppable With Nbk Latest Promo Release Details, Unstop-TeluguStop.com

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి.

ఈ సినిమా విడుదలకు మరొక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా హీరో రామ్ చరణ్ బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో( Unstoppable Show ) లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Telugu Anjana Devi, Chiranjeevi, Game Changer, Klin Kaara, Ram Charan, Ramcharan

రామ్ చరణ్ తో పాటు హీరో శర్వానంద్, దిల్ రాజు, పాల్గొన్నారు.అయితే ఇందుకు సంబంధించిన 4 నిముషాలు ఎపిసోడ్ ని తాజాగా విడుదల చేసారు.ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాలయ్య బాబు చరణ్ ని మాత్రం ఒక ఆట ఆడుకున్నారు.ఈ షోలో చరణ్ తల్లి సురేఖ,( Surekha ) నానమ్మ అంజనా దేవి( Anjana Devi ) మాట్లాడిన ఒక వీడియోని విడుదల చేశారు.ఆ వీడియోలో సురేఖ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో మాకు మనవడు కావాలి అని చెప్పింది.

అదే విషయాన్నీ ఒక లేఖ రూపం లో పంపడంతో ఆ విషయాన్ని చరణ్ చదివి అందరికీ వినిపించాడు.అయితే ఆ విషయం గురించి ఇంటికి వెళ్ళాక సమాధానం చెబుతానని అన్నాడు.

Telugu Anjana Devi, Chiranjeevi, Game Changer, Klin Kaara, Ram Charan, Ramcharan

తర్వాత 2023 మీ తండ్రికి చాలా ఎమోషన్ గిఫ్ట్ ఇచ్చావు అనగా ఆ వీడియోని చూస్తూ ఎమోషనల్ అయ్యారు చరణ్.ప్రతిరోజు తనతో రెండు గంటల రేపు ఆడుకుంటాను తనకోసం రెండు గంటలకి కేటాయిస్తాను అని తెలిపారు.మీ కూతురి పేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తావు అని అడగగా నా కూతురు నన్ను ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో అప్పుడు అందరికి రివిల్ చేస్తాను అని తెలిపారు.తర్వాత స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్, నాగ బాబు ఫొటో వేసి విరిద్దరిలో ఎవరితో పార్టీ చేసుకోవడానికి వెళ్తావు అని అడగగా ఇద్దరితో కాదు తన మామయ్య అల్లు అరవింద్‌ సరైన వ్యక్తి అని చరణ్‌ నవ్వుతూ బదులిచ్చారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube