ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాజాగా రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.నేను శంకర్( Shankar ) గారి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాని బ్లాక్ లో టికెట్ కొనుగోలు చేసి ఆ సినిమాని చూశానని తెలిపారు.
రాజకీయాలు సంగతి పక్కన పెట్టండి అప్పటికి అసలు యాక్టర్ అవుతానో లేదో కూడా తెలియదు కానీ ఆయన సినిమాని మాత్రం బ్లాక్ లో టికెట్ కొని చూశాను.
ఇక ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రేమికుడు సినిమాకి కూడా తోడు ఎవరూ లేకపోతే అమ్మతో పాటు కలిసి ఆ సినిమాకు వెళ్ళను.ఇలా శంకర్ గారి సినిమాలలో ఒక మెసేజ్ ఉంటుంది.అలాగే అన్ని జనరేషన్స్ వారు చూసే విధంగా ఆ సినిమా ఉంటుంది అంటూ శంకర్ పట్ల ప్రశంసల కురిపించారు.
ఇక దిల్ రాజు( Dil Raju ) గారి గురించి కూడా మాట్లాడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.నేను తొలిప్రేమ సినిమా చేస్తున్నప్పుడు దిల్ రాజు గారు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.
దిల్ రాజు గారు ఎక్కడో తొలిప్రేమ సినిమా పోస్టర్ చూశారు అలాగే ఎవరో ఈ సినిమా గురించి చెబితే విని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మాకు అడ్వాన్స్ ఇచ్చారు.అలా మొదలైన వ్యక్తి నా వకీల్ సాబ్( Vakeel Saab ) నిర్మాత కూడా ఆయనే.ఆయన ఎలాంటి నిర్మాత అంటే నేను కష్టాలలో ఉన్నప్పుడు నాకు ఎంతో అండగా నిలిచారు.పేరు ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు నాకు మార్కెట్ ఉందో లేదో తెలియని పరిస్థితుల నడుమ వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దిల్ రాజు గారు నాతో ఆ సినిమా చేసి నా జనసేన పార్టీకి డబ్బు అని ఇంధనాన్ని ఇచ్చిన వ్యక్తి దిల్ రాజు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.