చైనీయులను తెగ ఏడిపిస్తున్న విజయ్ సేతుపతి మహారాజ.. వీడియో వైరల్

ఓటీటీలు రావడంతో సినిమాల థియేటర్ వసూళ్లు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి.ముఖ్యంగా సినిమాలు చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో( OTT platforms ) విడుదల కావడంతో, ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం చాలావరకు తగ్గించారు.

 Video Of Vijay Sethupathi Maharaja Making Chinese People Cry Is Viral, Ott Platf-TeluguStop.com

ఇంట్లోనే సౌకర్యంగా సినిమాలు చూడటానికి ఇస్తా పడుతున్నారు.కానీ, కొన్ని ప్రత్యేక సినిమాలు మాత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడంలో సఫలమవుతున్నాయి.

తాజాగా, తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) నటించిన ‘మహారాజా’ సినిమా ( ‘Maharaja’ movie )దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా కూడా విశేషమైన విజయాన్ని అందుకుంది.చైనాలో( China ) ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన రావడం, ప్రేక్షకులను భావోద్వేగపరచడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

‘మహారాజా’ చిత్రం 2022 నవంబర్‌లో చైనాలో విడుదలైంది.ఈ సినిమా తండ్రీ-కూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుంది.చైనా ప్రేక్షకులు ఈ భావోద్వేగాన్ని తీవ్రంగా అనుభూతి చెందారు.థియేటర్లలో కళ్లను చెమర్చించుకుంటూ ఏడుస్తున్న వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ వీడియోలో, థియేటర్‌లో సినిమా చూసిన చైనా ప్రేక్షకులు భావోద్వేగాలతో కంటతడి పెట్టడం కనపడుతుంది.

‘మహారాజా’ చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.ఈ చిత్రం చైనాలో రూ.91.55 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.భారతదేశ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ ఈ అద్భుత విజయాన్ని పంచుకున్నారు.

నితిలన్ సామినాథన్ ( Nithilan Saminathan )దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణ్యం, అభిరామి గోపీకుమార్ వంటి ప్రముఖులు నటించారు.ఈ సినిమాలోని నటన, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించాయి.

భారతీయ చిత్రాలు చైనాలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.తండ్రీ-కూతురు సెంటిమెంట్ లేదా కుటుంబ అనుబంధాలను పునఃసృష్టించే కథలు చైనా ప్రేక్షకుల మనసులను కదిలిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube