రామ్ చరణ్ , శంకర్ ( Ram Charan, Shankar )కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ( game changer movie ) రిలీజ్ కు ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది.రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ నెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది.
గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ తో పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ ముగిసినట్టేనని చెప్పవచ్చు.గేమ్ ఛేంజర్ మూవీ రికార్డులు, విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్ మూవీ పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది.శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి తెలుగు మూవీ గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం.ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు( Directed Karthik Subbaraju ) ఈ సినిమాకు కథ అందించారు.అటు శంకర్ కు ఇటు రామ్ చరణ్ కు ఈ సినిమా 15వ సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమా నిర్మాతగా దిల్ రాజుకు 50వ సినిమా కావడం హాట్ టాపిక్ అవుతోంది.
2021 సంవత్సరంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడగా 2021లోనే ఈ సినిమాలోని సాంగ్స్ కు సంబంధించిన కంపోజింగ్ పూర్తైంది.వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్ కియారా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు.అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre-release event in America )జరుపుకున్న తొలి సినిమా గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం.256 అడుగుల కటౌట్ ఏర్పాటు ద్వారా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సొంతమైంది.ఈ సినిమాలోని నానా హైరానా సాంగ్ ను ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారు.ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు కాగా పాటలకే 75 కోట్లు ఖర్చు చేశారు.2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతోంది.