వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, సరైన పోషణ అందకపోవడం, ఒత్తిడి, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడటం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం, కురులు డ్రై గా మారడం ఇతర సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి.అయితే ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే ఆయా సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea powder ), మూడు మందారం పూలు( Hibiscus flowers ), నాలుగు లేదా ఐదు తుంచిన మందారం ఆకులు వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టౌ ఆఫ్ చేసి మరిగించిన డికాక్షన్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna powder ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) తో పాటు సరిపడా టీ డికాక్షన్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.
కుదుళ్లకు చక్కని పోషణ అందుతుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.
జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు దూరం అవుతాయి.చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే క్రమంగా నల్లబడుతుంది.
జుట్టు ఆరోగ్యంగా మరియు సూపర్ స్ట్రాంగ్ గా సైతం మారుతుంది.







