ఏపీలో రానున్న ఎన్నికల్లో గత తీర్పు రిపీట్ అవుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు.
అమరావతిలో సుమారు 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలనుకున్నాము.కానీ పెత్తందార్లు అడ్డుకున్నారని తెలిపారు.
ఆర్ 5 జోన్ విషయంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించారు.తాము ఎటువంటి చట్టాలను ఉల్లంఘించలేదని చెప్పారు.
అదేవిధంగా మాజీ మంత్రి బాలినేని విషయంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్న ఆదిమూలపు ఆయన విషయంలో కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.







