ప్రియుడుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తకు తాగే మద్యంలో విషం కలిపి హత్య చేసింది.అనంతరం మృతదేహాన్ని ఊరి అవుతల పడేసి చేతులు దులుపుకుంది.
పోలీసులకు ఈ కేసు చేదించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఎందుకంటే తప్పు చేసిన వారు ఎక్కడో ఓ చోట కచ్చితంగా దొరికిపోతారు.
అసలు వివరాలు ఏమిటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా( Chittoor ) వేమూరు గ్రామానికి చెందిన తిమ్మప్ప (40), ఇతని భార్య విజయమ్మ (30) కలిసి కూలీ పనులు చేసుకోవడం కోసం బెంగళూరులోని మహదేవపురకు వెళ్లారు.
అక్కడ తిమ్మప్ప కు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ పరిచయమయ్యాడు.కొన్ని రోజుల అనంతరం తిమ్మప్ప భార్య విజయమ్మ కు పెరుమాళ్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ప్రియుడితో కలిసి వివాహేతర సంబంధం( Illegal affair ) కొనసాగించడానికి భర్త అడ్డు ను తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి మాస్టర్ ప్లాన్ రచించింది.ప్రియుడు పెరుమాళ్, అతని స్నేహితుడు వెంకట చలపతి లు గత నెల 29వ తేదీన తిమ్మప్పను బార్ కు తీసుకువెళ్లి మధ్యలో విషం కలిపి తాగించారు.తిమ్మప్ప మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని టెంపో లో వేసుకుని మాలూరు తాలూకాలోని ఇరబనహాళ్లి గేట్ సమీపంలో ఉండే నీలగిరి తోపులో పడేశారు.

మృతుడు తిమ్మప్ప సహోదరుడు మే 1న మహాదేవపుర పోలీస్ స్టేషన్లో తిమ్మప్ప కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.గురువారం రాత్రి నీలగిరి తోపులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ( Police )మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా హత్య చేసి చంపినట్లుగా తేలింది.
దీంతో పోలీసులు భార్య విజయమ్మ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆమె మొబైల్ కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తానే తన భర్తను హత్య చేయించినట్లు తెలిపింది.
విజయమ్మతోపాటు పెరుమాళ్, వెంకటా చలపతి లను పోలీసులు అరెస్టు చేశారు.కేవలం నాలుగైదు రోజుల్లోనే హత్య కేసును చేదించడంతో మాలూరు పోలీసులను జిల్లా ఎస్పీ నారాయణ అభినందించారు.







