ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియాలో అడవిలో నివసించే జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈ క్రమంలో ఎక్కువగా విషపూరితమైన పాములకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా వన్య మృగాలకు సంబంధించి సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.
అయితే, తాజాగా ఒక కింగ్ కోబ్రా ( King Cobra )గుడ్డు నుంచి పిల్లలను బయటికి రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి చిన్న పాము గుడ్డును ( Small snake egg )పట్టుకొని వీడియో కోసం మొబైల్ కి దగ్గరగా చూపించడం మనం చూడవచ్చు.
అయితే, వీడియోలో పాము గుడ్డు సగం విరిగి ఉండి అందులోనుంచి చిన్న విషపూరితమైన కింగ్ కోబ్రా పాము పిల్ల బయటకు రావడం మనం చూడవచ్చు.ఇలా ఒక్కసారిగా గుడ్డులో నుంచి పాము బయటికి రావడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
అంతేకాకుండా ఆ పాము నోటిలో నుంచి చిన్న కోరలు కూడా బయటకు పెట్టి గుడ్డులో నుంచి బయటికి రావడం మనం వీడియోలో చూడవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఇక మరికొందరు అయితే ట్విట్టర్లో “నేచర్ ఈజ్ అమేజింగ్ ” అంటూ క్యాప్షన్ ను జత చేశారు.ఇక మరికొందరైతే, ఈ చిన్న కోబ్రా పిల్ల చాలా చురుగ్గా ఉందని చూడ్డానికి చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.