బుల్లితెర నటుడిగా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో అర్జున్ అంబటి( Arjun Ambati ) ఒకరు.ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
అర్జున్ అంబటి బిగ్ బాస్( Bigg Boss 7 ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లే టాప్ పైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక ఈయన హౌస్ లో కొనసాగుతున్న సమయంలోనే తనకు పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోయే సినిమాలో అర్జున్ అంబటికి అవకాశం ఇస్తున్నట్లు స్వయంగా డైరెక్టర్ బుచ్చిబాబు( Director Buchibabu ) బిగ్ బాస్ వేదికపై తనకు తెలియజేశారు.ఇలా తనకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం రావడంతో అర్జున్ అంబటి ఎగిరి గంతేశాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి అయితే బుచ్చిబాబు నుంచి ఫోన్ కాల్ కోసమే తాను ఎదురుచూస్తున్నానంటూ అర్జున్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో ఛాన్స్ రావడం గురించి కూడా అర్జున్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమాలో అవకాశం పొందాలి అంటే ఇండస్ట్రీలో కాళ్లకు చెప్పులు అరిగేలాగా తిరగాల్సి ఉంటుంది.ఎంతోమంది దర్శక నిర్మాతలను కలిసి అవకాశం ఇవ్వాలని అడుక్కున్నా కూడా రావడం చాలా కష్టం.అలాంటిది నాకు ఒక గొప్ప సినిమాలో బుచ్చిబాబు చాన్స్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం ఈ విషయంలో తాను బుచ్చిబాబు అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ అర్జున్ అంబటి రామ్ చరణ్ సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నారు.