తిరుమల ప్రసాదంలో కల్తీ నన్ను ఎంతో బాధించింది.. మనోజ్ కామెంట్స్ వైరల్!

తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా ఒకింత సంచలనం కాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో( Tirumala Laddu Prasadam ) కల్తీ జరిగిందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.తాజాగా ఈ ఘటన గురించి మంచు మనోజ్( Manchu Manoj ) సైతం రియాక్ట్ అవుతూ కామెంట్లు చేశారు.

 Manoj Comments About Tirumala Controversy Details, Manchu Manoj, Tirumala Laddu-TeluguStop.com

లక్షల సంఖ్యలో భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి ఎంతో కలత చెందానని మనోజ్ తెలిపారు.

ఇది కేవలం తప్పు మాత్రమే కాదని భక్తుల మనోభావాలను అవమానించడం అని మనోజ్ పేర్కొన్నారు.

ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని మనోజ్ అన్నారు.బాధ్యులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మనోజ్ చెప్పుకొచ్చారు.

సంస్కృతి, మతపరమైన విలువలను గౌరవించాలని మనోజ్ అన్నారు.సంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమని చెప్పడానికి ఇది ఉదాహరణ అని మనోజ్ పేర్కొన్నారు.

Telugu Manchu Manoj, Tirumalaladdu, Tollywood, Fish-Movie

మనోజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మనోజ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఒక సినిమా వాట్ ది ఫిష్( What The Fish ) టైటిల్ తో తెరకెక్కుతుండగా మరికొన్ని సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.సెలబ్రిటీలు ఈ వివాదం గురించి ఒకింత ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు.

Telugu Manchu Manoj, Tirumalaladdu, Tollywood, Fish-Movie

మనోజ్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.మనోజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.మనోజ్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

మనోజ్ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మనోజ్ నెక్స్ట్ లెవెల్ కథాంశాలను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube