బంగాళదుంప( Potato ) చాలా మంది ఇష్టంగా తినే కూరగాయల్లో ఒకటి.దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బంగాళదుంపను విరివిగా వాడుతుంటారు.
బంగాళదుంపతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.తినడానికి రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా బంగాళదుంప ఎంతో మేలు చేస్తుంది.
అలాగే అందాన్ని డబుల్ చేసే సామర్థ్యం కూడా బంగాళదుంపకు ఉంది.మరి ఇంతకీ చర్మానికి బంగాళదుంపని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) కోసం ఆరాటపడుతూ ఉంటారు.అలాంటి వారు వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడిలో ఫ్రెష్ బంగాళదుంప జ్యూస్ ను మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

మొటిమలు మచ్చలతో( Acne ) బాధపడుతున్న వారు రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ కు వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు మీ వంక కూడా చూడవు.
అదే సమయంలో స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.

డార్క్ సర్కిల్స్( Dark Circles ) ఉన్నవారు వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కు మూడు టేబుల్ స్పూన్లు పొటాటో జ్యూస్ మిక్స్ చేసి కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.రోజు నైట్ ఈ విధంగా చేస్తే కళ్ళ చుట్టూ నలుపు మొత్తం మాయమవుతుంది.
ఇక ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్లు పొటాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి.పది నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న అనంతరం తడి క్లాత్ చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఇలా చేస్తే స్కిన్ టైట్ గా బ్రైట్ గా మారుతుంది.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
చర్మం యవ్వనంగా మరియు ఆరోగ్యంగా మెరుస్తుంది.పిగ్మెంటేషన్ సమస్య ఉన్న కూడా దూరమవుతుంది.