ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.6.13
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.5.22 ల6.22
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:
ఈరోజు పాత రుణాలు తీర్చాగలుగుతారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.మొండి బాకీలు వసూలవుతాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం:
ఈరోజు ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.ఉద్యోగాల్లలో కష్టానికి తగిన గుర్తింపు లభించదు.ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
మిథునం:
ఈరోజు ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
కర్కాటకం:
ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది.మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
సింహం:
ఈరోజు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభ పడతారు వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది.నూతన వాహనయోగం ఉన్నది.ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.
కన్య:
ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తుల:
ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం:
ఈరోజు ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు.వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
ధనుస్సు:
ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.మొండి బాకీలు వసూలవుతాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.
మకరం:
ఈరోజు అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది పడతారు.బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.
కుంభం:
ఈరోజు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు.వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.
మీనం:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.చాలకాలంగా పూర్తికానీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి.పాతబాకీలు వసూలవుతాయి.
వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.