చాలామంది ప్రజలలో ఈ మధ్య కాలంలో స్థూలకాయం ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తోంది.స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందడానికి వ్యాయామం, డైట్ కంట్రోల్ తో పాటు మరికొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఈ నియమాలను పాటిస్తే సులభంగా అధిక బరువును తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.
అధిక బరువును దూరం చేసుకోవడానికి ప్రతి రోజు రాత్రి సమయంలో తేలికైన భోజనం తీసుకోవడం మంచిది.
అందుకే నిద్రపోయేటప్పుడు కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి.భోజనంలో సాధ్యమైనంత వరకు త్వరగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
భోజనం తిన్న తర్వాత కాసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ అధికంగా తినడాన్ని అరికడుతుంది.
అందుకే భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం మంచిది.

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల బాడీ డిటాక్స్ కూడా అవుతుంది.దానివల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు.ఆల్కహాల్ లో పెద్ద మొత్తంలో కేలరీలు ఉంటాయి.
కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఆల్కహాల్ తీసుకుంటే వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది.అందుకే బరువు తగ్గాలంటే రాత్రి నిద్రపోయే సమయంలో పొరపాటున కూడా ఆల్కహాల్ తాగకూడదు.
బరువు తగ్గేందుకు సరైన నిద్ర కూడా ఎంతో అవసరం రోజు పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

ఎందుకంటే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల బాడీ పూర్తిగా రిలాక్స్ అవుతుంది.ఫలితంగా రాత్రి మంచి నిద్ర పడుతుంది.దాంతో కొవ్వు కరిగి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
రాత్రి నిద్రపోయే ముందు పొరపాటున కూడా టీ, కాఫీలు అసలు కాకూడదు.ఎందుకంటే రాత్రి టీ, కాఫీ తాగడం వల్ల నిద్ర పై ప్రభావం చూపుతుంది.
నిద్ర పూర్తి కాకపోవడంతో మెటభాలిజం పాడవుతుంది.ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది.