1.ప్రధానికి రఘురామ కృష్ణంరాజు లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు లేఖ రాశారు.తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
2.చంద్రబాబు బెయిల్ షరతులపై విచారణ వాయిదా
చంద్రబాబు పిటిషన్ షరతులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది విచారణను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.
3.మాజీ ఎంపీ వివేక్ రాజీనామా
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బిజెపి రాజీనామా చేశారు.కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
4.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్
రాష్ట్ర అవతరణ వేడుకలను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది.ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జగన్ ఆవిష్కరించారు.
5.ఢిల్లీ వెళ్లిన లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీకి వెళ్లారు.
6.సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజ శ్యామల యాగం
సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి లోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.
7.చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోము
మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో టిడిపి అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో నవంబర్ 28 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని ,అరెస్టు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు హామీ ఇచ్చారు.
8.నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం హైదరాబాద్ వెళ్ళనున్నారు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారు.
9.రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది.రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ ప్రారంభించారు.
10.చంద్రబాబుపై డిప్యూటీ సీఎం విమర్శలు
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబుపై సంచలన విమర్శలు చేశారు.ఇన్నాళ్లు చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తూ వచ్చారని ఇప్పుడు కంటి పరీక్ష కోసం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు.
11.పట్టాలు తప్పిన ఘాజీపూర్ ట్రైన్
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగాజా లో రైలు ప్రమాదానికి గురైంది.సహిల్ దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఘాజీపూర్ సిటీ నుంచి ఆనంద్ విహార వెళ్లేందుకు ప్రయాగ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది.కొద్దిసేపటికి రైలులోని రెండు భోగిలు పట్టాలు తప్పయి.
12.రైలు ప్రమాదం బాధితులను పరామర్శించిన మంత్రి
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షేతగాత్రులను ఏపీ మంత్రి సత్యనారాయణ పరామర్శించారు.
13.పురందరేశ్వరి విమర్శలు
కేంద్రం సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి విమర్శలు చేశారు.
14.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.సత్తుపల్లి , ఇల్లందులో జరిగే సభలో ఆయన పాల్గొంటారు.
15.రాహుల్ గాంధీ పర్యటన
తెలంగాణ కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించనున్నారు.ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం రెండున్నరకు కల్వకుర్తిలో సభలో ఆయన పాల్గొన్నారు.
16.బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులకు భద్రత పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు భద్రతను పోలీసు అధికారులు పెంచారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు
17.గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను 101.50 పైసలకు పెంచారు.
18.నేడు హైదరాబాద్ కు కేంద్ర ఎన్నికల బృందం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు నేడు హైదరాబాద్ కేంద్ర ఎన్నికల బృందం రానుంది
19.అచ్చం నాయుడు కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు తెలిపారు.
20.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్
కెసిఆర్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మవద్దని కర్ణాటకలో ప్రతి పథకం అమలు అవుతుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.