ఈ హెయిర్ సీరంను వాడితే తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.ఇందుకు కారణాలు అనేకం.

 If You Use This Hair Serum You Can Stay Away From White Hair Details! Hair Serum-TeluguStop.com

రసాయనాలతో కూడిన జుట్టు ఉత్పత్తులను వాడటం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, ధూమపానం, థైరాయిడ్ తదితర కారణాల వల్ల ఎందరో మందికి తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడుతుంది.దాంతో ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు పడే పాటలు అన్నీ ఇన్నీ కావు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ సీరం అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, ప‌ది వేపాకులు, అర కప్పు గోరింటాకు ఆకులు వేసుకుని బాగా ఉడికించాలి.క‌నీసం ప‌ది నిమిషాల పాటు ఉడికించి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఉడికించిన మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో సీరంను సపరేట్ చేసుకోవాలి.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు జుట్టు మొత్తానికి తయారు చేసి పెట్టుకున్న సీరంను అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు కనుక ఇలా చేస్తే తెల్ల జుట్టు ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

అదే సమయంలో హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.మరియు కురులు సిల్కీగా షైనీ గా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube