కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడ ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని అందుకొని అధికార పీఠాన్ని దక్కించుకుంది.ఇక గత ప్రభుత్వమైన వైసీపీ ( YCP)పాలనలో చాలా అరాచకమైన ఆకృత్యాలు జరగడం తో చాలామంది జనాలు రియాలైజ్ అయి ఎన్డీయే కూటమికి భారీ సీట్లను కట్టబెట్టారు.
ఇక వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం నిజంగా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి.ఇంతకు ముందు అధికారం ఉందనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని చంద్రబాబును టార్గెట్ చేస్తు చాలామంది చాలా బూతులైతే మాట్లాడారు.
ఇంకా అందులో శ్రీ రెడ్డి( Sri Reddy) కూడా ఉన్నారు.ప్రస్తుతం శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ కొన్ని ఎమోషనల్ మాటలను రాస్తూ ఒక పోస్ట్ అయితే చేశారు.
![Telugu Chandra Babu, Jana Sena, Pawan Klayan, Sri Reddy, Tollywood-Movie Telugu Chandra Babu, Jana Sena, Pawan Klayan, Sri Reddy, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Sri-Reddy-ycp-tdp-pawan-klayan-tollywood-jana-sena.jpg)
అందులో ఏముందంటే ఆమెకు జీవితం మీద విరక్తి పుట్టిందని, తను ఏ క్షణమైనా చనిపోవవచ్చని, తనని ఆ భద్రకాళి మాత నే కాపాడాలి అంటూనే, తనకి ప్రస్తుతం సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా వస్తున్నాయంటూనే తనకి ఇలాంటి ఆలోచన రావడానికి మీడియా, జనసేన, తెలుగుదేశం పార్టీ లే కారణం అంటూ వాళ్ళను దూషిస్తూ తను ఏ క్షణమైనా మరణించవచ్చు అంటూ ఒక పోస్ట్ అయితే చేసింది.ఇక మొత్తానికైతే తను చేసిన ఈ పోస్ట్ చాలామందిలో కలవరపెడుతుందనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఈ పోస్ట్ చూసిన చాలామంది శ్రీ రెడ్డి ఏదో టైమ్ పాస్ కి ఇలాంటి పోస్ట్ లు పెడుతుంది తప్ప నిజంగా ఆమెకు చనిపోయేంత ధైర్యం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![Telugu Chandra Babu, Jana Sena, Pawan Klayan, Sri Reddy, Tollywood-Movie Telugu Chandra Babu, Jana Sena, Pawan Klayan, Sri Reddy, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Sri-Reddy-ycp-tdp-pawan-klayan-chandra-babu-naidu-tollywood-jana-sena.jpg)
ఇక మరి కొంతమంది మాత్రం వాళ్ల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ఏదో ఒక టైమ్ పాస్ వీడియోలు చేస్తూ ఉండేది.ఇక ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారం లో లేదు కాబట్టి ఎవరినో ఒకరిని బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తుందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక మరి కొంతమంది మాత్రం ఎన్డీయే కూటమి తనను ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తుందేమో అనే ఉద్దేశ్యంతో ముందుగానే ఆమె ఇలాంటి పోస్ట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు…
.