బెంగళూరులో( Bengaluru ) ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.సాధారణంగా వాహనాలపై ఒకటి, రెండు లేదా మహా అయితే పది ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉండడం చూస్తుంటాం.
అయితే, ఓ స్కూటర్‌పై( Scooter ) ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు( 311 Traffic Violation Cases ) నమోదు కావడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.అంతేకాదు, ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.1.6 లక్షల జరిమానా విధించడంతో పోలీసులు ఆ స్కూటర్‌ను సీజ్ చేశారు.కానీ, ఫైనల్‌గా ఆ వాహన యజమాని జరిమానా మొత్తం చెల్లించి తన స్కూటర్‌ను తిరిగి తీసుకుపోవడం గమనార్హం.

బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామి( Periasamy ) అనే వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు.అతని స్కూటర్‌పై గత కొంతకాలంగా అనేక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా సిగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కేసులు నమోదయ్యాయి.అయితే, ఇన్ని కేసులు ఉన్నప్పటికీ స్కూటర్‌ను అధికారులు ఇప్పటివరకు సీజ్ చేయకపోవడం స్థానికుల దృష్టికి వచ్చింది.
ఓ వ్యక్తి ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేసి ట్రాఫిక్ పోలీసులను( Traffic Police ) ప్రశ్నించగా, అది వైరల్ అయింది.ఈ పోస్ట్‌ను చూసిన ట్రాఫిక్ పోలీసులు విచారణ జరిపి 311 కేసులు నమోదైనట్టు గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, 311 కేసులకు సంబంధించిన చలానా రసీదులన్నీ కలిపితే, ఆ లిస్ట్ 20 మీటర్ల పొడవు ఉంటుంది.సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,61,500 ఫైన్ విధించారు.ఈ నేపథ్యంలో స్కూటర్‌ను సీజ్ చేయడంతో, యజమాని మరుసటి రోజే పూర్తి జరిమానా చెల్లించి తన వాహనాన్ని తిరిగి తీసుకున్నాడు.ఈ ఘటనను గమనించిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఇందులో కొందరేమో.ఆ కట్టే ఫైన్‌తో కొత్త స్కూటర్‌నే కొనేసుకోవచ్చు కదా అని కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో.
అతనికి ఆ స్కూటీ బాగా అచ్చుబాటు వచ్చినట్లుందని ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.ప్రమాదాలు తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జీవితాన్ని ప్రమాదంలో పెట్టకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎంతో ముఖ్యమని ట్రాఫిక్ పోలీసులు హితవు పలికారు.







