తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిని ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunnam ) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ‘అనిల్ రావిపూడి’( Anil Ravipudi ) తన తదుపరి సినిమాని చిరంజీవితో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక వెంకటేష్( Venkatesh ) తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.అలాగే అనిల్ రావిపూడి కెరియర్ లో కూడా ఇది ఒక పెద్ద విజయం అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని నైజాంలో( Nizam ) దిల్ రాజ్( Dil Raju ) ఓన్ గా రిలీజ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఈ సినిమా నైజాంలో దాదాపు 40 కోట్ల లాభం వచ్చిందంటూ ఇప్పుడు కొత్త లెక్కలు అయితే చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీలో సీనియర్ హీరోల మీద ఉన్న అన్ని రికార్డులను తిరగరాసిందనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అలాగే ఈ ఫ్యామిలీ సినిమాతోనే మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించడం అనేది మామూలు విషయమైతే కాదు… మొత్తానికైతే వెంకటేష్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం.
ఆయన వైవిధ్యభరితమైన పాత్రను పోషించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు…ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటాడనే చెప్పాలి…
.







