అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.ఇంతకు ముందే చాలా రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ చెప్పి అతన్ని ఒప్పించాడు.
మరి మొత్తానికైతే 2027వ సంవత్సరంలో పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్( Spirit ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు.

ఒకవేళ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కనక కొట్టినట్లైతే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది అంటూ కొంతమంది ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఎందుకు అంటే అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) 2000 కోట్లు మార్కు ను టచ్ చేశాడు.కాబట్టి తన తదుపరి సినిమా కూడా భారీ రేంజ్ లో ఉండాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో( Trivikram ) చేస్తున్న సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందనే విషయం పక్కన పెడితే ఆ తదుపరి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రం వైల్డ్ గా ఉండబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా సందీప్ అల్లు అర్జున్ తో కూడా బోల్డ్ కంటెంట్ తో సినిమాని తీస్తాడా లేదంటే జెన్యూన్ కంటెంట్ తో సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి…భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…
.







