విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సినీ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో లైగర్( Liger ) ఒకటి.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పూరీకి నిర్మాతగా కూడా భారీ నష్టాలను మిగిల్చింది.
లైగర్ మూవీ నటించే సమయంలో నా కూతురు అసౌకర్యంగా ఫీలైందని హీరోయిన్ తండ్రి వెల్లడించగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.లైగర్ సినిమాలో అనన్య పాండే( Ananya Pandey ) హీరోయిన్ గా నటించడం గమనార్హం.
2022 సంవత్సరంలో లైగర్ సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా గురించి వినిపిస్తే డిస్ట్రిబ్యూటర్లు సైతం భయాందోళనకు గురవుతారు.అనన్య పాండే ఈ సినిమాలో గ్లామర్ రోల్ లో నటించగా ఆమె తన నటనతో మెప్పించడం విషయంలో ఫెయిలయ్యారు.
లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనన్య పాండేకు తెలుగులో ఎక్కువగా ఆఫర్లు రాలేదు.అనన్య పాండే తండ్రి చంకీ పాండే( Chunky pandey ) తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లైగర్ మూవీ హిందీలో కూడా రిలీజ్ చేస్తుండటంతో ఆ సమయంలో అనన్యను ఎంపిక చేశారని చంకీ పాండే పేర్కొన్నారు.లైగర్ లో ఛాన్స్ వచ్చిన సమయంలో అనన్య అసౌకర్యంగా ఫీలైందని చంకీ పాండే చెప్పుకొచ్చారు.ఆ హీరోయిన్ పాత్రకు తాను సెట్ కానని అనన్య పాండే భావించిందని చంకీ పాండే వెల్లడించడం గమనార్హం.సినిమా సక్సెస్ సాధిస్తే మంచి పేరు వస్తుందని చెప్పి నేను ఒప్పించానని చంకీ పాండే తెలిపారు.

అనన్య పాండే రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.అనన్య పాండే కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.అనన్య పాండే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.హీరోయిన్ అనన్య పాండేకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.







