తెలంగాణా అధికార పార్టీ కాంగ్రెస్ పై( Congress ) విమర్శలతో విరుచుకుపడుతున్న బీఆర్ఎస్( BRS ) ఆ పార్టీపై , ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తోంది.అనేక అంశాలపై నిలదీస్తోంది.
దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ కూడా కౌంటర్లు ఇస్తుండగా , దమ్ముంటే విచారణకు ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు.దీంతో వాటిపై విచారణలకు ఆదేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నిర్ణయం తీసుకుంటూ ఉండడంతో , మళ్లీ వాటిపై కోర్టుకు వెళ్లడం లేదా సైలెంట్ అయిపోవడం వంటివి బీఆర్ఎస్ రాజకీయం పై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటుచేసుకున్న అనేక పనులు , అనేక అవినీతి వ్యవహారాలు చోటుచసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా, దీనిపై దమ్ముంటే విచారణలు చేయించి నిజాలు బయటపెట్టాలని బీఆర్ఎస్ సవాల్ దీంతో చాలా వాటిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ సైలెంట్ అయిపోతుంది.
![Telugu Brs, Congress, Jagadeesh Reddy, Harish Rao, Telangana Cm-Politics Telugu Brs, Congress, Jagadeesh Reddy, Harish Rao, Telangana Cm-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/brs-leaders-facing-troubles-with-enquiries-detailss.jpg)
గత కొద్ది రోజులుగా తెలంగాణ అసెంబ్లీలో ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకుంటున్నా యి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రతి డిమాండ్ కు సరేనంటూ సమాధానం వచ్చేది అధికారపక్షం నుంచి.కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ విపక్షంలోకి వచ్చాక వైఖరి మారినట్టుగా కనిపిస్తోంది.
సమస్య ఏదైనా సరే విచారణకు సిద్ధం అంటూ సవాల్ చేసిన పరిస్థితి గతంలో ఉండేది.గత సమావేశాల్లో విద్యుత్ కొనుగోలు లో అవకతవకులు జరిగాయనే అంశంపై దమ్ముంటే విచారణకు ఆదేశించాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) సవాల్ విసరగా.
దానిపై జ్యుడీషియల్ విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై కూడా ఇదే తరహా డిమాండ్లు వినిపించగా ప్రభుత్వం సీరియస్ గానే స్పందించి న్యాయ విచారణకు ఆదేశించింది .ఒకవైపు కమిషన్ ల ద్వారా విచారణలు కొనసాగుతున్నాయి.అయితే విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిటీ చైర్మన్ వ్యవహార శైలిని తప్పుపడుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది.
![Telugu Brs, Congress, Jagadeesh Reddy, Harish Rao, Telangana Cm-Politics Telugu Brs, Congress, Jagadeesh Reddy, Harish Rao, Telangana Cm-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/brs-leaders-facing-troubles-with-enquiries-detailsa.jpg)
ఈ కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు .విచారణ కమిటీ చైర్మన్ ను మార్చి విచారణను కొనసాగించమని కోర్టు తీర్పు చెప్పడంతో కొత్త చైర్మన్ నియమించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గొర్రెల పథకం త పాటు, మరో రెండు అంశాలపై కూడా విచారణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం, కావాలని అడిగే దమ్ము మీకుందా అంటూ బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.కానీ సభలోనే ఉన్న బీఆర్ఎస్ సభ్యులు దీనిపై సైలెంట్ అయిపోయారు.
దీంతో విచారణలు అంటేనే బీఆర్ఎస్ భయపడుతోందా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది
.