బాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోలలో ఒకప్పుడు అందరి కన్నా ముందు ఉన్న పేరు అక్షయ్ కుమార్( Akshay Kumar ).ఆయన సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ప్రేక్షకులలో ఎంతో కొంత అంచనాలు ఉంటాయి.
అలాగే ప్రతి సినిమా కోసం ఆయన బాగా కష్టపడతాడు.ప్రొడ్యూసర్స్ హీరోగా అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.
అలాగే ఖాన్ త్రయానికి కూడా సాధ్యం కానీ ఎన్నో హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న పేరు కూడా అక్షయ్ కుమార్ కే దక్కింది.అయితే ఇదంతా గతం … ఆయనకు ఇప్పుడు హిట్స్ లేవు.
ఏకంగా గత మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు.అక్షయ్ కుమార్ కి అలాగే గత 18 సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ సినిమాలు గా ఉన్నాయి.
నిజానికి ప్రతి ఏడూ నాలుగు నుంచి ఐదు సినిమాలు తీస్తాడు అక్షయ్ కుమార్.అలా తీయడం మిగతా హీరోలకి సాధ్యం కానీ పని కానీ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమాలు విడుదల చేయడంలో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు.అందుకే ఆయనతో సినిమాలు తీయడానికి బాలీవుడ్లో చాలామంది నిర్మాతలు క్యూ కడతారు.ఇప్పుడు ప్రస్తుతం అక్షయ్ కుమార్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఎన్ని సినిమాలు తీశామన్నది ముఖ్యం కాదు ఎన్ని విజయాలు ఉన్నదే ముఖ్యం అన్నట్టుగా మారిపోతున్న రోజుల్లో ఆయన 18 సినిమాలు గతం లో చేసినవి అపజయాలు కావడంతో అందరి దృష్టికి ఆయన పై పడింది.పైగా ప్రస్తుతం ఆయన రిలీజ్ అయిన సర్ఫీరా సినిమా( sarfira ) సైతం ఫ్లాప్ దిశగా దూసుకెల్లడం అందరినీ బాధిస్తుంది.
ఇందులో ముందు న్యూస్ డైరెక్టర్ గా కీరవాణి ని తీసుకున్నారు.కానీ నిర్మాతకు కీరవాణి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో కీరవాణి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా, జీవి ప్రకాష్( G V Prakash Kumar ) సంగీతం అందించాడు.పాటలు పరవాలేదు అనిపించిన ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.అలా మొత్తానికి అక్షయ్ కుమార్ ఈ ఫలితాలతో తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునే స్థితికి వచ్చాడు.
ఇక ఇలాగే కొనసాగితే అక్షయ్ కుమార్ పూర్తిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.అయినప్పటికీ ఆయనకు వరుస సినిమాలు ఇప్పుడు లైన్ లో అయితే ఉన్నాయి మరి చూడాలి.
ఎప్పుడు సక్సెస్ అక్షయ్ కుమార్ ని పలకరిస్తుందో.