సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంది.. ఒలింపిక్స్ మెడల్ సాధించింది.. మను భాకర్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

బలమైన లక్ష్యాన్ని ఎంచుకుంటే మాత్రమే జీవితంలో కోరుకున్న సక్సెస్ సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.మూడు సంవత్సరాల క్రితం టోక్యో ఒలింపిక్స్( Tokyo Olympics ) లో బరిలోకి దిగి మను భాకర్ ప్రతిభను చాటుకున్నారు.19 సంవత్సరాల వయస్సులోనే మనూ భాకర్ ( Manu Bhakar )మూడు ఈవెంట్లలో పోటీ పడటం గమనార్హం.టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు ఎక్కువ సంఖ్యలో పతకాలను గెలుచుకున్న ఆమె ఒలింపిక్స్ లో మాత్రం ఒత్తిడి వల్ల చిత్తు అయ్యారు.

 Manu Bhaker Inspirational Success Story Details Inside Goes Viral In Social Medi-TeluguStop.com

క్వాలిఫయింగ్( Qualifying ) పోటీలలో కీలక సమయంలో ఆమె పిస్టల్ సరిగ్గా పని చేయలేదు.ఆరు నిమిషాల కీలక సమయం వృథా కావడంతో రెండు పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశాన్ని ఆమె కోల్పోయారు.

ఆ ప్రభావం ఆమె పాల్గొన్న మరో రెండు ఈవెంట్లపై కూడా పడింది.ఆ సమయంలో ఓటమిపాలవడంతో మనూ భాకర్ ఒకానొక సమయంలో సివిల్స్ కు ప్రిపేర్ కావాలని అనుకున్నారు.

అయితే స్నేహితుల సూచనలతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

Telugu Bhakarbronze, Manu Bhakar, Manubhaker, Olym, Tokyo Olym-Inspirational Sto

ఏకాగ్రత చెక్కు చెదరకుండా లక్ష్యంపై దృష్టి పెట్టిన ఆమె ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్( Olympics ) లో తన లక్ష్యాన్ని సాధించారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్ లో మను భాకర్ కాంస్య పతకాన్ని( Bhakar Bronze Medal ) సాధించారు.22 సంవత్సరాల వయస్సులోనే మను భాకర్ తన ప్రతిభతో ప్రశంసలు అందుకున్నారు.మను భాకర్ మొత్తం 12 కోట్ల రూపాయలు అందుకుని చిన్న వయస్సులోనే కోటీశ్వరురాలు అయ్యారు.

Telugu Bhakarbronze, Manu Bhakar, Manubhaker, Olym, Tokyo Olym-Inspirational Sto

సోషల్ మీడియాలో సైతం మను భాకర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.మను భాకర్ కు గతంలో హర్యానా ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు అందజేసింది.మను భాకర్ తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

ఆమె సక్సెస్ స్టోరీని ఎంత ప్రశంసించినా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మను భాకర్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube