కొందరు డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారు.మంచి ఉద్యోగం ఉన్నా సరే చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి ముందుకు వస్తారు.
ఇలాంటి వారు ఉండటం వల్లే విమానాల ద్వారా స్మగ్లింగ్ చేయడం కామన్ అయిపోయింది.తాజాగా పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్‌ను సాక్స్‌లో లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ ( Smuggling of foreign currency )చేస్తూ అడ్డంగా బుక్ అయింది.
పాకిస్థాన్‌లోని అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
కొన్ని రోజుల క్రితం, ఒక భారతీయ ఎయిర్ హోస్టెస్( Air hostess ) తన శరీరంలో బంగారం దాచి పెట్టుకుని తరలిస్తుండగా పట్టుబడింది.
అదే విధంగా, పాకిస్తాన్ కస్టమ్స్ అధికారులు ఒక పాకిస్తాన్ ఎయిర్ హోస్టెస్‌ను విదేశీ కరెన్సీ అంటే డాలర్లు, రియాల్స్‌ను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.ఆ ఎయిర్ హోస్టెస్ తన సాక్స్‌లో ఆ డబ్బును దాచి పెట్టుకుని తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
పాకిస్తాన్ కస్టమ్స్ అధికారులు, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( Federal Investigation Agency ) (FIA) ఇమ్మిగ్రేషన్ విభాగం సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు.ఎయిర్ హోస్టెస్‌ను పట్టుకుని తనిఖీ చేసినప్పుడు, ఆమె సాక్స్‌లో 37,318 డాలర్లు, సుమారు 40 వేల సౌదీ రియాల్స్ దొరికాయి.అధికారుల అంచనా ప్రకారం, ఆమె సుమారు 40 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్మగ్లింగ్ చేస్తోంది.
ఈ ఎయిర్ హోస్టెస్ లహోర్ నుంచి జెద్దాకు వెళ్తోంది.ఈమె గురించి కస్టమ్స్ అధికారులకు ముందే ఎవరో సమాచారం ఇచ్చారట.ఆ సమాచారం ఆధారంగా ఎయిర్ హోస్టెస్‌ను అనుమానించి తనిఖీ చేసినప్పుడు, ఆమె సాక్స్‌లో పెద్ద పెద్ద కట్టలలో విదేశీ కరెన్సీ నోట్లు దొరికాయి.పాక్ కస్టమ్స్ అధికారులు ఆ ఎయిర్ హోస్టెస్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు టీమ్‌కు అప్పగించారు.