టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్లలో మీనా ఒకరు కాగా ఈ హీరోయిన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.దృశ్యం సిరీస్ సినిమాల ద్వారా మీనా మంచి పేరును సంపాదించుకున్నారు.
కొన్నేళ్ల క్రితం మీనా( Meena ) భర్తను కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఆ తర్వాత మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియా, వెబ్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పలు యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.తప్పుడు కంటెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానెళ్ల( YouTube channels )పై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు, అసోసియేషన్ అధ్యక్షుడికి ధన్యవాదాలు అని మీనా తెలిపారు.ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీరు చూపుతున్న అంకితభావం నిజంగా అభినందనీయం అని మీనా కామెంట్లు చేశారు.
నటీనటులు ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీనా తెలిపారు.నెగిటివ్ కామెంట్లను ఎదురించడంలో మన సంఘాన్ని కాపాడటంలో అందరం కలిసి ముందుకు వెళ్లాలని మీనా పేర్కొన్నారు.ఈ విషయంలో మీరు నిరంతరం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని మీనా వెల్లడించారు.
మీనా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.మీనా ఇతర భాషల్లో సైతం ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
మీనాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.సరికొత్త కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న మీనా క్రేజ్ ను సైతం పెంచుకుంటున్నారు.
మీనాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.తన గురించి తప్పుగా ప్రచారంలోకి వచ్చిన వార్తలు మీనాను ఎంతో హర్ట్ చేశాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మీనా కెరీర్ పరంగా మరిన్ని ఎక్కువ సంఖ్యలో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.