సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఇక నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటుడు తారకరత్న ( Taraka Ratna )ఒకరు.
అయితే తారకరత్న ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి తన భార్య అలేఖ్య రెడ్డి( Alekhya Reddy ) ఒంటరిగా తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఉన్నారు.
ఇక ఈయన ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తారకరత్న తల్లిదండ్రులు ఇప్పటికీ అలేఖ్యరెడ్డిని తన పిల్లలని చేర తీయలేదు.
ఇకపోతే ఇటీవల అలేఖ్య రెడ్డి పుట్టినరోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.తారకరత్న తల్లి తండ్రులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయమని అడిగారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ వారు ఇప్పటివరకు మమ్మల్ని కలవలేదు అలాంటప్పుడు ఫోటో ఎక్కడ ఉంటుంది అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
వారితో కలవాలని ఉందా అని ప్రశ్నించగా అవును అంటూ సమాధానం చెప్పారు.
ఇక తారకరత్న బాటలోని మీరు కూడా రాజకీయాలలోకి( Politics ) రాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు అలేఖ్య రెడ్డి సమాధానం చెబుతూ… తనకు రాజకీయాలలోకి రావాలని లేదని ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలే తన ప్రపంచమని తెలియజేశారు.ఇక మీ పిల్లల చదువు కోసం లోకేష్ బ్రహ్మణి బాధ్యతలు తీసుకున్నారా అని ప్రశ్నించారు ఎవరు తన పిల్లల బాధ్యతలు తీసుకోలేదని తెలియజేశారు.
ఇక విజయసాయిరెడ్డి గురించి ఇటీవల వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఈ వార్తల గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ వార్తలపై అలేఖ్య రెడ్డి స్పందిస్తూ ఆయన ఏంటో మాకు తెలుసు అంటూ ఒక్క మాటలో సమాధానం చెప్పారు.ఇక విజయ సాయి రెడ్డి స్వయాన ఈమెకు పెదనాన్న అవుతారనే విషయం మనకు తెలిసిందే.