టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి మనందరికీ తెలిసిందే.నేను శైలజ(nenu Shailaja) సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో చాలామంది హీరోల సరసన నటించి మెప్పించింది.ఇకపోతే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.కాగా సింపుల్ అండ్ హోమ్లీ క్యారెక్టర్(Simple and homely character) చేస్తూ గ్లామర్ కి దూరంగా ఉండే కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో కాస్త రూట్ మార్చిందని చెప్పాలి.

నెమ్మదిగా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది.నిన్న మొన్నటి వరకు సింపుల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో (Glamour show)చేయడానికి రెడీ అవ్వడంతో పాటు బోల్డ్ కంటెంట్(Bold content) కి కూడా సిద్ధమవుతోంది.మహానటి ముందు వరకూ ఒక లెక్క మహానటి తర్వాత ఒకలెక్క.మహానటితో సౌత్ మొత్తం ఎంత పేరు తెచ్చిపెట్టిందో కీర్తి క్యారెక్టర్లని అంతే లిమిట్ చేసింది.ఆ సినిమా తర్వాత గ్లామర్ క్యారెక్టర్లకి మరీ దూరం జరిగాల్సొచ్చింది కీర్తి.అలా ఉండడంతో పెద్దగా ఆఫర్లు రాక, హైలైట్ అవ్వక కెరీర్ క్లాస్త స్లో అయ్యింది.
దాంతో రియలైజ్ అయిన కీర్తి బోల్డ్ అండ్ అగ్రెసివ్ రోల్స్ కి రెడీ అనడమే కాదు ఆ రూట్లో వెళ్తూ ఫుల్ బిజీ అవుతోంది.కీర్తిసురేశ్ ఇటీవల కెరీర్ స్పీడ్ పెంచేసింది.
ఇలాంటి క్యారెక్టరే చేస్తాను, అలా అయితే చెయ్యను అంటూ లిమిటేషన్స్ పెట్టుకోకుండా బోల్డ్, గ్లామర్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బేబీజాన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లలానే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది.దాంతో అప్పటి వరకూ కీర్తిని చాలా పద్దతిగా చూసిన వాళ్లు బేబీజాన్ లో కీర్తిని చూసి ఒకరకంగా షాక్ అయ్యారు.లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ చేస్తున్న అక్కా సిరీస్ లో సీరియస్ మాఫియా రోల్ లోనే కాస్త బోల్డ్ గాకనిపించబోతోంది కీర్తి సురేశ్.
అయితే ఇప్పటికే అభిమానులు ఈ విషయంలో షాక్ లో ఉండగా పెళ్లికి ముందు వరకు బోల్డ్ పాత్రల్లో నటిస్తే ఒక రకం కానీ ఇటీవల పెళ్లి అయింది అప్పుడే బోల్డ్ పాత్రలో నటించడం ఏంటి అంటూ కొంతమంది మండిపడుతున్నారు.