నాగచైతన్య చందూ మొండేటి (Naga Chaitanya , Chandu Mondeti)కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి తెరకెక్కగా ఈ సినిమాలలో ప్రేమమ్ హిట్ గా నిలిస్తే సవ్యసాచి అంచనాలను అందుకోలేదు.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా తండేల్ కాగా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ వస్తోంది.సినిమా మరీ అద్భుతం అని చెప్పలేం కానీ లవ్ స్టోరీ (Love Store)తర్వాత సరైన సక్సెస్ లేని చైతన్యకు ఈ సినిమాతో ఆ లోటు తీరినట్టేనని చెప్పవచ్చు.
కథ :
ఉత్తరాంధ్రకు చెందిన రాజు(Raju) (నాగచైతన్య) అనే జాలరి జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.సత్య అలియాస్ బుల్లితల్లి (సాయిపల్లవి)(Sai Pallavi) బాల్యం నుంచి ప్రేమలో ఉంటారు.రాజు, సత్య (Raju, Satya)మధ్య ప్రేమ బంధం ఎలా బలపడింది? 21 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన రాజు పాకిస్తాన్ బోర్డర్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఈ జాలరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? రాజును, ఇతర మత్స్యకారులను ఇండియాకు రప్పించడానికి సత్య చేసిన పోరాటమే ఈ సినిమా.
విశ్లేషణ :

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya)సినిమాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయినా నటుడిగా చైతన్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు తక్కువే ఉన్నాయి.తండేల్ సినిమాతో ఆ లోటు కొంతమేర తీరినట్టేనని చెప్పవచ్చు.సాయిపల్లవి మాత్రం ఈ సినిమాలో కనిపించిన ప్రతి సన్నివేశంలో ప్రతిభను చాటుకున్నారు.సాయిపల్లవి ఎందుకు అంత గొప్ప నటి అయ్యారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.చందూ మొండేటి దర్శకత్వం ఫస్టాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండాఫ్ లో కొన్ని సీన్ల విషయంలో తడబడ్డారు.
చందూ మొండేటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా క్లాసిక్ అయ్యి ఉండేది.
డీఎస్పీ తన మ్యూజిక్, బీజీఎంతో తండేల్ మూవీకి ప్రాణం పోశారు.గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.మలుపులతో కూడిన ఒక అందమైన ప్రేమకథ చూడాలని భావించే వాళ్లకు తండేల్ మూవీ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్లు :

చైతన్య, సాయిపల్లవి నటన
మ్యూజిక్, బీజీఎం
ఫస్టాఫ్
మైనస్ పాయింట్లు :
సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు
కథనంలో లోపాలు
దర్శకత్వం
రేటింగ్ :
2.75/5.0







