ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి అంటే కథ మొత్తం బాగా ఉండటంతో పాటు క్లైమాక్స్ సీన్ కూడా బాగుండాలి.సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని చెప్పవచ్చు.
సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు అన్నట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు డైరెక్టర్లు.ఇలా క్లైమాక్స్ బాగా ఉన్న సినిమాలు ప్రేక్షకుల మధులలో ఎక్కువ కాలం గుర్తుండిపోతూ ఉంటాయి.
ఇటీవల కాలంలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) అలాగే ఉప్పెన సినిమాల క్లైమాక్స్ లు బాగా గుర్తుండిపోయాయి.ముఖ్యంగా ఉప్పెన క్లైమాక్స్ అయితే ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని చెప్పాలి.

అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ (Ram Charan)కొత్త సినిమాకు కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ని, చాలా కాలం పాటు గుర్తిండిపోయే విధంగా డిజైన్ చేశారని ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.రామ్ చరణ్, బుచ్చిబాబు(ram charan, buchhi babu) కాంబినేషన్ లో మైత్రీ మూవీస్(Mythri Movies) భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకి క్లైమాక్స్ చాలా కాలం గుర్తిండిపోతుందని చెప్పుకుంటున్నారు.అయితే ఇప్పటి దాకా ఎవరూ ఊహించని, కొత్త తరహా క్లైమాక్స్ అని, అదే సినిమాకి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెడుతుందని, చాలా కాలం ఈ క్లైమాక్స్ ని మాట్లాడుకుంటారని చెప్తున్నారు.ఈ క్లైమాక్స్ విని ప్లాట్ అయ్యే రామ్ చరణ్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం(Rahman’s music) అందిస్తున్నారు.

అలాగే చిత్రానికి వింటేజ్ లుక్ కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.అలా పాత తరం కెమెరాతో సినిమాను షూట్ చేయబోతున్నారట.పాత రోజుల్లో సినిమా చిత్రీకరణ కోసం ఫిల్మ్ రీల్‌ని వాడేవారనే విషయం తెలిసిందే.
పాత తరం కెమెరాతో చిత్రీకరిస్తే కొన్ని షాట్స్ బాగా వస్తాయని అంటుంటారు.ఇప్పుడు అదే కారణంతో బుచ్చిబాబు కొన్ని సీన్స్ పాత రీల్ కెమెరాతో చిత్రీకరించనున్నారట.
ఇలా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్త కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.







